Telugu Director: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న నటులు చాలామంది ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడంలో మాత్రం వాళ్ళు చాలా వరకు వెనుకబడిపోతున్నారనే చెప్పాలి… కొంతమంది దర్శకులు సైతం తమదైన రీతిలో సత్తా చాటుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక స్టార్ డైరెక్టర్ ఇద్దరు హీరోలను చాలా తక్కువగా అంచనా వేశాడు. అందువల్లే ఆయన ఎంటైర్ కెరియర్ లో ఒక్క ఇండస్ట్రీ హిట్ ను కూడా దక్కించుకోలేకపోయాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు ఆయన తక్కువ అంచన వేసిన హీరోలు ఎవరు అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…
Also Read: IPL గ్రౌండ్ లో విక్టరీ వెంకటేష్ చిందులు.. కావ్య మారన్ చప్పట్లు.. వైరల్ అవుతున్న వీడియో
చిరంజీవితో ‘చూడాలని ఉంది’ మహేష్ బాబు తో ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్న దర్శకుడు గుణశేఖర్… ఆయన కెరియర్లో చాలా మంచి విజయాలైతే సాధించాడు. కానీ ఆ సమయంలోనే కొంతమంది హీరోలు అతనితో సినిమాలు చేయడానికి ప్రయత్నం చేసిన కూడా ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట.
దానివల్ల హీరోలు తర్వాత అతనికి డేట్స్ ఇవ్వడానికి చాలా వరకు ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఆయనతో సినిమాలు చేయాలనుకున్న హీరోలు ఎవరంటే నాగార్జున, బాలయ్య బాబు లుగా తెలుస్తుంది. చూడాలని ఉంది సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత అతను బాలయ్య తో ఒక సినిమా చేయాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమాను పట్టాలెక్కించలేదట.
దాంతో ఆయా హీరోల అభిమానులు తీవ్రమైన నిరాశనైతే వ్యక్తం చేశారు. ఇక బాలయ్య బాబు తో సినిమా చేసి ఉంటే భారీ విజయం దక్కేదని గుణశేఖర్ ఇప్పుడు తన ఖాతాలో ఒక భారీ సక్సెస్ వేసుకునేవాడని చాలామంది చెబుతుంటారు.
ఇక బాలయ్యతో అతను సినిమా చేయడానికి ట్రై చేసిన కూడా బాలయ్య బాబు మాత్రమే అవకాశం ఇవ్వలేదట…నాగార్జునతో ఒక సినిమా ప్లాన్ చేసినప్పటికి అది కూడా వర్కౌట్ కాలేదు. దాంతో నాగార్జున సైతం గుణశేఖర్ కి అవకాశం ఇవ్వలేదంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి…