https://oktelugu.com/

Photo Story : 14 ఏళ్లకే హీరోయిన్ గా చేసిన ఈ పాప ఎవరో తెలుసా?

జయప్రద 1962 ఏప్రిల్ 3న ఏపీలోని రాజమండ్రిలో జన్మించారు. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జయప్రద నాట్యంలో ప్రావీణ్యురాలు. ఆమె 14 ఏళ్ల వయసులో ఉండగా ఓసారి నాట్య ప్రదర్శన చేశారు. ఈమె ప్రదర్శనకు మెచ్చిన నటుడు, డైరెక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి జయప్రద అని పేరు పెట్టారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 7, 2023 / 02:34 PM IST
    Follow us on

    Photo Story : సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన వాళ్లే. అప్పట్లో సినిమాల్లో నటించిన వారు ఇప్పుడు   నటులుగా కొనసాగుతున్నారు. దశాబ్దం కింద సినిమాల్లో నటించాలంటే ప్రత్యేక కళ ఉన్నవారికి ప్రాధాన్యం ఉండేది. ముఖ్యంగా సాంప్రదాయ నృత్యం నేర్చుకున్న వాళ్లకు మరీ ప్రిపరెన్స్ ఇచ్చేవారు. అయితే ఈ అవకాశం అందరికీ వచ్చేది కాదు. అలా ఓ పాప సాంప్రదాయ నృత్యం నేర్చుకోవడంతో ఆమెను ఓ డైరెక్టర్ సినిమాల్లోకి తీసుకున్నారు. నటిగా అప్పట్లోనే గుర్తింపు తెచ్చుకోవడంతో చాలా సినిమాల్లో నటించారు. ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక స్టార్ హీరోయిన్ గా మారారు. తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ సినిమాల్లో దాదాపు 300 సినిమాల్లో నటించారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారు?

    1980ల్లో కొందరు హీరోయిన్లకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. ముఖ్యంగా నృత్యం తెలిసిన వారికి సినిమాల్లో బాగా అవకాశాలు వచ్చాయి. అలా భరత నాట్యంలో ప్రావీణ్యం పొందిన జయప్రద చిన్నప్పటి నుంచే సినిమాల్లో మెదిలారు. పెరిగి పెద్దయ్యాక అగ్రహీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చిన ఈమె పలు పదవులు పొందారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న జయప్రదకు చెందిన చిన్న నాటి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    జయప్రద 1962 ఏప్రిల్ 3న ఏపీలోని రాజమండ్రిలో జన్మించారు. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జయప్రద నాట్యంలో ప్రావీణ్యురాలు. ఆమె 14 ఏళ్ల వయసులో ఉండగా ఓసారి నాట్య ప్రదర్శన చేశారు. ఈమె ప్రదర్శనకు మెచ్చిన నటుడు, డైరెక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి జయప్రద అని పేరు పెట్టారు. ఆమె మొదటిసారిగా 1976లో ‘భూమికోసం’ అనే సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు.  ఇందులో ఆమె పాత్ర నిడివి కేవలం మూడు నిమాషాలే. కానీ ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

    ఆ తరువాత సినీ రంగంలోనే కొనసాగిన జయప్రద తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ చిత్రాలో నటించి మెప్పింది. హీరోయిన్ గా సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర్ రావు, కృష్ణ , శోభన్ బాబు నటులతో సినిమాలు చేసింది. కమలాసన్ తో ఆమె చేసిన ‘సాగర సంగమం’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. 2005 వరకు వరుస సినిమాల్లో నటించింది. సినిమాల్లో కొనసాగుతున్న సమయంలోనే 1994లో టీడీపీలో చేరారు. ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీలో కొనసాగుతున్నరు.