నిర్మాత దిల్ రాజు అంటేనే ఒక మినీ సినీ ఇండస్ట్రీ. అనామకుడిగా సినిమా పరిశ్రమకు వచ్చి.. తనకంటూ ఓ హిస్టరీని క్రియేట్ చేసుకున్న ఘనత దిల్ రాజుది. పైగా రాజు నిర్మాణ విలువలు పక్కాగా ఉంటాయి. అందుకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దిల్ రాజుకి ఎప్పుడు అంటే అప్పుడు వెంటనే డేట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు.
నిజానికి పవన్ వెనుక చాలా మంది నిర్మాతలు వెంట పడుతున్నారు. అయినా, పవన్ మాత్రం ఒక్క దిల్ రాజుకే ఎందుకు ఫిదా అయిపోయాడు అనేదే ఇక్కడ మిగిలిన నిర్మాతల ప్రశ్న. నిజానికి దిల్ రాజు సినిమా ప్లానింగ్ హీరోని బట్టి మారుతూ ఉంటుంది. పవన్ తనకు వకీల్ సాబ్ కోసం డేట్లు ఇవ్వగానే పవన్ కి అనుగుణంగా షూటింగ్ ప్లాన్ చేశాడు.
అలాగే పవన్ కి తగ్గట్టు స్క్రిప్ట్ లో మార్పులు చేయించాడు. అన్నిటికి మించి పవర్ స్టార్ కి 65 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఇచ్చాడు.ఇంత చేసి సినిమా రిలీజ్ చేసినా.. వకీల్ సాబ్ సినిమా స్పెషల్ షో లు క్యాన్సిల్ కావడం, రేట్లు మారడం వంటి వాటి వల్ల దిల్ రాజుకు నష్టం వచ్చింది. అయినా దిల్ రాజు ఈ రోజు వరకూ ఆ నష్టాల గురించి ఎక్కడా మాట్లాడలేదు.
ఈ విషయంలోనే పవన్ కి దిల్ రాజు బాగా నచ్చాడట. తనకు రావాల్సిన మేరకు రెవెన్యూ రాకపోయినా.. దాని గురించి రాజు, పవన్ దగ్గర ఎప్పుడూ ప్రస్తావించలేదట. అందుకే, స్వయంగా పవనే దిల్ రాజుకి ఫోన్ చేసి మళ్లీ మరో సినిమా చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందుకే ప్రస్తుతం దిల్ రాజు మంచి కథ, డైరక్టర్ కోసం వెతుకులాట మొదలుపెట్టాడు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Green signal from pawan kalyan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com