
Green India Challenge: ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా నాగ చైతన్యతో (Chaitanya) కలిసి బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ (Aamir khan) బేగంపేట విమానాశ్రయంలో మొక్కలు నాటారు. ప్రకృతి వైపరిత్యాలు తగ్గాలంటే చెట్లు అధికంగా ఉండాలి. అలాగే విషపూరితమైన కాలుష్యానికి చెక్ పెట్టాలన్నా పచ్చని చెట్లు ఎక్కువగా పెరగాలి. అన్నిటికి మించి మన భవిష్యత్తు తరాలు బాగుండాలంటే.. వారికీ మనం అందించాల్సింది స్వచ్ఛమైన గాలి. అంటే.. మొక్కలు నాటడం ఒక్కటే మార్గం.
అందుకే ప్రతి సినీ ప్రముఖుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ హరిత యజ్ఞంలో భాగం అయ్యాడు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పేరుతో తోటి సినీ ప్రముఖులను కూడా ఈ గొప్ప పనిలో మమేకం అయ్యేలా చేశారు. పైగా స్టార్ హీరోలు కూడా తమ ఫ్యాన్స్ అంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటాలని మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు కూడా ఎప్పటికప్పుడు అభిమానులను మోటివేట్ చేస్తూనే ఉన్నారు.
#AamirKhan participated in Green India Challenge today in Hyderabad. Later in the evening today, he will be attending #LoveStory event. pic.twitter.com/HOH1Z0PhXX
— Aakashavaani (@TheAakashavaani) September 19, 2021
ఇక తాజాగా నాగ చైతన్యతో పాటు ఆమీర్ ఖాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఇలా ప్రతి వ్యక్తి మూడు మొక్కలు నాటినా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, భావి తరాలకు ఉపయోగపడిన వారమవుతాం. అందుకే మొక్కలు నాటడాన్ని ఏదో ఓ కార్యక్రమంలా కాకుండా, లేదా అందరూ చేస్తున్నారు మనం కూడా చేద్దాం అనే ఒక ఆలోచనతో కాకుండా బాధ్యతగా స్వీకరించాలి.
మనం నాటిన మొక్క ఎదుగుతున్న సమయంలో దాని గాలిని మనం పీలుస్తూ ఆస్వాదించాలి. ఇక చైతు – అమీర్ మొక్కలు నాటిన కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌కుమార్ కూడా పాల్గొన్నాడు. హీరోలిద్దరితో ఆయన సరదాగా సెల్ఫీ తీసుకుని సందడి చేశాడు. ఇక ఆమిర్- నాగ చైతన్య కలిసి మొక్కలు నాటడానికి కారణం.. వారిద్దరూ కలిసి హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’ అనే సినిమాలో నటిస్తున్నారు.