
Bommarillu Movie: ‘దిల్ రాజు’కు (Dil Raju) ఇప్పుడు ఒక ఆలోచన నిద్ర పట్టకుండా చేస్తోందట. అదే ‘బొమ్మరిల్లు’ (Bommarillu) సినిమా సీక్వెల్. ఏమిటి.. నిజమే ? ఇదే ప్రశ్న అడుగుతున్నారు దిల్ రాజును. నిజానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఇప్పటిది కాదు, పదేళ్ల క్రితమే వచ్చింది. కానీ అప్పుడు అది ప్రాక్టికల్ గా వర్కౌట్ కాలేదు. కానీ.. ఈ మధ్య దిల్ రాజుకు ఒక పాయింట్ తట్టింది. ఆ పాయింట్ తో సినిమా చేసి.. ‘బొమ్మరిల్లు’ సీక్వెల్ అంటే.. సినిమాకి భారీ మార్కెట్ అవుతుంది అనేది దిల్ రాజు ప్లాన్.
కానీ, సీక్వెల్ అంటే.. ఏదో రకంగా ‘బొమ్మరిల్లు’ కథకు కంటిన్యూ చేయాల్సి వస్తోంది. బాధ్యత గల తండ్రి ఎలా ప్రవర్తించాలి అనే కోణంలో బొమ్మరిల్లు చిత్రం హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ లో ఒక ఫీల్ ఉంటుంది. మరి సీక్వెల్ చేస్తే.. ఆ ఫీల్ మళ్ళీ వస్తోంది అని గ్యారంటీ లేదు. పైగా బొమ్మరిల్లు కథలో ఉన్న మెసేజ్ కూడా అద్భుతమైనది.
భార్యాపిల్లల్ని పోషించడం, వాళ్ళను ఉన్నత స్థితిలో ఉండటమే కాదు.. వారి ఇష్టాఇష్టాలు గ్రహించి, వారికి సాధికారత కల్పించాలి అనే యాంగిల్ ను ఎలివేట్ చేయడమే ఈ చిత్ర సారాంశం. కథలో మధ్యతరగతి విలువలు ఉన్నాయి. సగటు ప్రేక్షకుడికి దగ్గరగా ఉంది ఈ కథ. పైగా కొన్ని సంభాషణలు గుండెల్ని పిండేసేలా ఉంటాయి.
తండ్రిగా నిన్ను గెలిపించడానికి పాతికేళ్లుగా నేను ఓడి పోతూనే వున్నాను అంటూ కొడుకు పాత్ర ఒక డైలాగ్ చెబితే.. ప్రతి కొడుకు అలాగే ఫీల్ అయ్యాడు. ఇలా ప్రతి మాట, ప్రతి పాత్ర అద్భుతంగా మలిచారు. అందుకే తెలుగు సినీ రంగంలో బొమ్మరిల్లు ఒక ఫీల్ గుడ్ మూవీగా స్థిరపడిపోయింది. కాబట్టి.. అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే.. కచ్చితంగా ఆలోచించాలి.
అన్నిటికీ మించి బొమ్మరిల్లు గొప్ప ప్రేక్షకాదరణతో పాటు, అవార్డుల పంట కూడా పండించింది. అందుకే.. దిల్ రాజు సీక్వెల్ చేయాలనే ఆలోచను బయటకు వ్యక్తపరచడానికి కూడా చాలా ఆలోచిస్తున్నారట. మరి దిల్ రాజు నిజంగానే బొమ్మరిల్లు చిత్రాన్ని సీక్వెల్ చేస్తారా ? లేదా ? అనేది చూడాలి.