Amalapuram: విదేశీ కొలువులు సాధిస్తున్నారు తెలుగు యువత. కండాంతరాలు దాటి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉన్నత చదువులు అభ్యసిస్తున్న వారు. ఈ క్రమంలో అక్కడి సంప్రదాయాలు, అలవాట్లకు సైతం అలవాటు పడుతున్నారు. ప్రేమ వివాహాలు సైతం చేసుకుంటున్నారు. అయితే ఓ జంట మాత్రంపెద్దవాళ్ళను ఒప్పించి మరి పెళ్లి చేసుకోవడం విశేషం. ఓ తెలుగు యువకుడి ఖండాంతర ప్రేమను పెద్దవారు అంగీకరించారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసి పంపించారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఈదరపల్లి కి చెందిన మనోజ్ కుమార్ బీటెక్ పూర్తి చేశాడు. 14 సంవత్సరాల కిందట ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లారు. అక్కడ మంచి ఉద్యోగం సైతం దక్కింది. ప్రస్తుతం మనోజ్ ఓ బ్యాంకు మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే చదువుకునే రోజుల్లోనే కెనడాకు చెందిన ట్రేసి రోచేడాన్ తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటినుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను ఇరువైపులా పెద్దలు అంగీకరించడంతో ఒక్కటయ్యారు.
* హిందూ సంప్రదాయం ప్రకారం
కొద్దిరోజుల కిందట కెన్యాలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వెంటనే కెనడాలో వివాహం చేసుకున్నారు. అయితే మనోజ్ హిందూ సాంప్రదాయంలో వివాహ బంధంతో ఒక్కటవుతామని ప్రతిపాదన పెట్టాడు. దీనికి అమ్మాయి బంధువులు ఒప్పుకున్నారు. రెండు రోజుల కిందట ఈదరపల్లికి బంధువులు వచ్చారు. సోమవారం పెళ్ళికొడుకు, పెళ్లికూతురు చేసే వేడుక, హల్దిని ఘనంగా నిర్వహించారు. ఈ వారంలో దిండిలో వారి వివాహం జరగనుంది. 8న రిసెప్షన్ నిర్వహించనున్నట్లు మనోజ్ కుటుంబ సభ్యులు తెలిపారు.
* విదేశీ అతిధుల సందడి
అయితే ఈ వివాహ వేడుకలకు విదేశీ అతిధులు కూడా వచ్చారు. గోదావరి జిల్లాల అందాలకు ముగ్గులు పోతున్నారు. యువతి సమీప బంధువులతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వీరంతా కోనసీమ అందాలను చూసి మైమరిచిపోతున్నారు. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని.. ఇక్కడి వాతావరణం కూడా బాగుందని చెబుతున్నారు.