Raja Saab Movie Latest Updates: ఎప్పుడూ లేని విధంగా ఈమధ్య కాలం లో పెద్ద సినిమాలకు విడుదల ముందు ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విడుదలకు ముందు స్టార్ హీరో సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ జరుగుతుంది అనడం కేవలం ఒక ప్రచారం మాత్రమేనా?, కేవలం భారీ హైప్ ఉన్న సినిమాలకు మాత్రమే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సినిమా నే విడుదలకు ముందు ఈ ఏడాది ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదురుకోవాల్సి వచ్చింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఒక సినిమాకు ఇప్పుడు క్రేజ్ లేకపోతే బిజినెస్ జరగడం అసాధ్యం అనే విషయాన్నీ. ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదలకు ముందు పవన్ కళ్యాణ్ ఎన్ని లెక్కలు సెటిల్ చేయాల్సి వచ్చిందో మనమంతా చూసాము. నిర్మాతకు అండగా నిలబడి ఆయన చేసిన ఈ పనిని ప్రతీ ఒక్కరు మెచ్చుకున్నారు.
ఇక నేడు విడుదల అవ్వాల్సిన నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం కూడా ఆర్ధిక ఇబ్బందుల కారణం విడుదల ఆగిపోయింది. ఇప్పుడు సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ‘రాజా సాబ్'(The Rajasaab) కూడా చివరి నిమిషం లో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఈ చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ IVY ఎంటర్టైన్మెంట్ సంస్థ కు దాదాపుగా 260 కోట్ల రూపాయిల వరకు చెల్లించాలి. దీనిపై ఆయన కోర్టు లో కేసు కూడా నడుస్తోంది. దీనికి సంబంధించిన సెటిల్మెంట్స్ ఇంకా పూర్తి అవ్వలేదు. ఎప్పుడు చేయబోతున్నారో కూడా క్లారిటీ లేదు. ఒకవేళ ఈ నెలలో సెటిల్మెంట్ జరగకపోతే కచ్చితంగా కచ్చితంగా ఈ చిత్రం వాయిదా పడక తప్పదని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ఒక పాట విడుదలైంది. అక్టోబర్ నెలలో విడుదలైన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమాకు సంబంధించి ఎదో ఒక కంటెంట్ ని మేకర్స్ విడుదల చేస్తూనే ఉంటారు. ఈలోపు ఈ చిత్రానికి ఉన్న సమస్య సడిలిపోతుందో లేదో చూడాలి. రీసెంట్ గానే సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని కూడా ప్రారంభించారు. నార్త్ అమెరికా లో అయితే బుకింగ్స్ ప్రారంభించిన మూడు రోజుల్లోనే 50 వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంతే కాకుండా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ ని కూడా దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. హిందీ లో కూడా విస్తృతంగా ప్రమోట్ చేయబోతున్నారు. ఒకపక్క జరగాల్సిన కార్యక్రమాలు మొత్తం జరుగుతూనే ఉన్నాయి. కానీ విడుదల అవుతుందా లేదా అనే టెన్షన్ కూడా ఆడియన్స్ లో ఉంది. ఏమి జరగబోతుందో చూడాలి.