
రాజకీయాల్లోకి వెళ్లి మూడేళ్ల తర్వాత మళ్లీ సినిమాల బాటపట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ తో రీఎంట్రీ ఇస్తున్నారు. మెగా ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన వకీల్ సాబ్ టీజర్లకు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ వాటితో రచ్చ చేశారు. ఈ సినిమాను రిలీజ్ కు రెడీ చేశారు.
వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజ్ మెగా ఫ్యాన్ష్ విషయంలో ఓ విషయంపై తర్జనభర్జన పడుతున్నాడట. పవన్ ఫ్యాన్స్ విషయంలో ఏమాత్రం మైనస్ ఏర్పడినా పెద్ద వివాదమే అవుతుంది. ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ హీరోస్ చిరు, రామ్ చరణ్ హాజరు కానున్నాయి.. మరోవైపు ఈ ఈవెంట్ కు కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాడట. సాధారణ ఫంక్షన్లకు మెగా హీరో ఈ ఒక్కరు వచ్చినా ఫుల్ జోష్ ఉంటుంది. ఇక ముగ్గురు పవన్, చిరు, రాంచరణ్ లాంటి ముగ్గురు మెగా హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే ఫ్యాన్స్ కి పెద్ద పండుగే అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అందుకే ఈ పండుగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.
కరోనా వైరస్ మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ పరిస్థితులు మారాయి. 50శాతంతోనే రెస్టారెంట్లు, ఫంక్షన్లు, బార్లు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిబంధనలు రెడీ చేస్తోంది. 100 కోట్ల వరకు పెట్టిన వకీల్ సాబ్ సినిమాను ఫుల్ అక్యూపెన్సీతో రిలీజ్ అయితేనే నిర్మాత దిల్ రాజుకు లాభం. కరోనాతో 50శాతం మందితో థియేటర్లు కనుక నడిస్తే నిండా మునిగినట్టేనంటున్నారు. ప్రభుత్వం ఎలాంటి పరిమితులు ఇస్తుందోనన్న ఆందోళనలో దిల్ రాజు ఉన్నాడట.. ఇదే సమయంలో ఫ్యాన్స్ ను ప్రీరిలీజ్ కు ఆహ్వానిస్తే కరోనా టైంలో క్రౌడ్ పెరిగిపోతుందని ఆలోచిస్తున్నారు.
ఒకవేళ వారిని పిలువకపోతే వారు చేసే అల్లరి మాములుగా ఉండదు. మరోవైపు మెగా హీరోస్ కి కూడా ఫ్యాన్స్ సమక్షంలో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటేనే వారిలోనూ సెల్ఫ్ కాన్పిడెన్ష్ పెరుగుద్ది. ఇక ఫ్యాన్స్ ను ఆహ్వానించి చివరి సమయంలో వద్దంటే వారు ఎలాగూ ఊరుకోరు.దీంతో ఏం చేయాలో తోచక దిల్ రాజ్ కన్ఫ్యూజ్ అవుతున్నాడట.
మూడేళ్ల తరువాత పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఫంక్షన్ హిట్టయితే సినిమాకు ఢోకా ఉండదని ఆయన అభిప్రాయం. మరి ఈవెంట్ ను చుట్టుముట్టిన కరోనాతో దిల్ రాజు ఎలా మెయింటేన్ చేస్తాడన్నది వేచిచూడాలి.