Vijay Devarakonda Rashmika Mandanna Viral Video: రీసెంట్ గానే టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో అయితే ఇప్పటికీ వీళ్లకు సంబంధించిన ఫోటోలు , వీడియోలే చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈమధ్య కాలం లో ఒక చిన్నారి వీళ్లిద్దరి పెళ్లిని ఉద్దేశించి చేసిన ఒక క్యూట్ వీడియో ఎంత వైరల్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక ఈమధ్యనే పెళ్లి చేసుకున్నారట , పెళ్లి తర్వాత అభిమానులందరికీ పిలిచి స్వీట్లు , భోజనాలు పెట్టారట, నేనేమి పాపం చేశాను ఫ్రెండ్స్, నేను కూడా అభిమానినే కదా, నేను కూడా రీల్స్ చేస్తున్నాను కదా, నన్ను ఎందుకు పిలవరు , దయచేసి ఈ వీడియో ని వైరల్ చెయ్యండి ఫ్రెండ్స్ అని అంటుంది.
Also Read: ఆ పెంపుడు కుక్కతోనే అమెరికాకు అణుముప్పు.. ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక..
ఈ వీడియో కి స్పందించిన విజయ్ దేవరకొండ, చిట్టి తల్లి, త్వరలోనే నిన్ను మా ఇంటికి పిలుస్తా , నీకు ఇష్టమైనవన్నీ వడ్డిస్తాను, కలిసి తిందాము అని కామెంట్ చేస్తాడు. ఎదో సరదాకి కామెంట్ చేసాడేమో అని అంతా అనుకున్నారు కానీ, నిజంగానే ఆ చిన్నారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమతో ఆ చిన్నారికి అన్నం వడ్డిస్తున్న విజువల్స్ ని చూడొచ్చు. ఈ వీడియో ని చూసిన నెటిజెన్స్ ఈ జంటని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. వీళ్లకు అభిమానులు అంటే ఎంత గౌరవం , ప్రేమ అనేది పెళ్లి తర్వాత వాళ్ళు చేసిన కొన్ని పనులు కారణంగా తెలిసిందని, ఇంత మంచి వాళ్ళని అసలు అనుకోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక వీళ్ళ సినిమాల విషయానికి వస్తే, వీళ్లిద్దరు ‘డియర్ కామ్రేడ్’ చిత్రం తర్వాత మళ్లీ కలిసి ఎలాంటి సినిమాలో కూడా నటించలేదు. కానీ ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబలి’. ‘టాక్సీ వాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన రాహుల్ సంక్రుత్యాన్ ఈ చిత్రానికి దర్సకత్వం వహిస్తున్నాడు. మన దేశానికీ స్వతంత్రం రాకముందు రాయలసీమ ప్రాంతం లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదే విధంగా వీళ్లిద్దరి పెళ్లి జరిగిన మరుసటి రోజు ఈ చిత్రం మేకర్స్ విడుదల చేసిన మొదటి పాట ప్రోమో కూడా బాగా వైరల్ అయ్యింది.
