Vijay Devarakonda : రీసెంట్ గా వచ్చిన ఖుషీ సినిమాతో హిట్ ను అందుకున్నారు విజయ్ దేవరకొండ. సమంతతో జతకట్టిన ఈ హీరో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. గీతా గోవిందం సినిమాతో హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ హీరో ఎన్నో సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాలు హిట్ మరికొన్ని సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. అయితే ఈయన సహాయం చేయడంలో మాత్రం ఎక్కడ వెనకాడరు. సంపాదించిన దానిలో పేదవాళ్ల కోసం ఖర్చు చేస్తారు అనే టాక్ సంపాదించి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్నారు విజయ్.
తాజాగా ఆయన ఫౌండేషన్ వల్ల సాయం పొందిన ఓ ట్రాన్స్ జెండర్ మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. విజయ్ దేవరకొండ చేసిన సాయం ఎప్పటికి మరువలేనిదని.. ఆమె చెప్పిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. కరోనా సమయంలో లాక్ డౌన్ విధిస్తే.. ఆ సమయంలో మాకు ఆహారం దొరకలేదని.. ఇంటి అద్దు కూడా కట్టలేని పరిస్థితి అని తెలిపింది. అలాంటి సమయంలో విజయ్ దేవరకొండ ఫౌండేషన్ గురించి తెలుసుకొని.. దాంట్లో ఫామ్ నింపానని తెలిపింది ట్రాన్స్ జెండర్.
వీరి ఫామ్ చూసిన విజయ్ టీం వెంటనే రియాక్ట్ అయ్యారట. సరుకులు కొనుక్కోండి బిల్లు పంపండి అని వెంటనే ఫోన్ పే చేశారట. ఆ రోజు పొందిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ… నాలానే చాలా మంది ట్రాన్స్ జెండర్లకు సాయం చేశారు అంటూ విజయ్ గురించి కొనియాడింది. అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. గతంలో కూడా ఈమె విజయ్ గురించి మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. దీంతో మా విజ్జు ఎంత మంచివాడు అంటూ ఆయన అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.
In an industry obsessed with transphobia, didn’t expect someone would be trans ally. Will watch your every film on the big screen. Kudos @TheDeverakonda ️⚧️
pic.twitter.com/UWJUTvrIqR— PJ (@filmisconstant) November 2, 2023