Homeఎంటర్టైన్మెంట్Vijay Divorce News: తమిళనాడు రాజకీయాల నుంచి విజయ్ తప్పుకోనున్నాడా..?ఆయన్ని టార్గెట్ చేసిందెవరు..?

Vijay Divorce News: తమిళనాడు రాజకీయాల నుంచి విజయ్ తప్పుకోనున్నాడా..?ఆయన్ని టార్గెట్ చేసిందెవరు..?

Vijay Divorce News: సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా రాణించిన తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేసిన హీరోలు చాలామంది ఉన్నారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఎంజీఆర్ దగ్గర నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ వరకు ప్రతి ఒక్కరు టాప్ హీరోలుగా పేరు సంపాదించుకొని రాజకీయ రంగ ప్రవేశం చేసిన వారే కావడం విశేషం…ఇక ప్రస్తుతం దళపతి విజయ్ సైతం తనదైన రీతిలో సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు. ఆయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని తన అభిమానులు కోరుకోవడంతో ‘టీవీకే’ అనే రాజకీయ పార్టీని పెట్టి రాజకీయ ప్రవేశం కూడా చేశాడు. ఇక ఈ సంవత్సరం జరగబోతున్న ఎన్నికల్లో తను అన్ని సీట్ల నుంచి పోటీ చేయబోతున్నాను అంటూ అనౌన్స్ చేశాడు. ఇక రీసెంట్ గా విజయ్ భార్య అయిన సంగీత తన భర్త తన దగ్గర ఉండడం లేదని ఒక హీరోయిన్ తో చాలా సంవత్సరాల పాటు లివింగ్ రిలేషన్ లో ఉంటున్నాడని నన్ను నా పిల్లల్ని అసలు పట్టించుకోవడం లేదంటూ ఆమె విజయ్ మీద కేసు పెట్టింది. తనకు విజయ్ నుంచి విడాకులు కావాలంటూ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఆయన రాజకీయానికి సంబంధించిన పనులు చేసుకోవాలా? లేదంటే డివోర్స్ కి సంబంధించిన వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవ్వాలా అనేది ఏదీ అర్థం కాక తలపట్టుకుంటున్నాడు.

Also Read: బాలయ్య కూతురు తేజస్విని డైరెక్టర్ గా మారుతుందా.? హీరో ఎవరంటే..?

ప్రస్తుతం తమిళనాడు సీఎం గా ఉన్న స్టాలిన్ విజయ్ భార్య చేత కేసు పెట్టించడానికి ప్రయత్నం చేశాడంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. రాజకీయంగా విజయ్ ని డౌన్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ‘జన నాయగన్’ అనే సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాల్సింది.

కానీ దానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపింది కూడా స్టాలిన్ గారే అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఇక విజయ్ ని అధికార పార్టీ వాళ్లు తొక్కెయ్యలని చూస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ సైతం ఈ పార్టీని ఉంచాలా? లేదంటే తీసేసి సినిమాలు చేసుకుంటూ తన లగ్జరీ లైఫ్ ని అనుభవించాలా? అనే ధోరణిలో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.

పార్టీ పెట్టి చాలా తక్కువ రోజులు అవుతుంది. ఈసారి ఎలక్షన్స్ లో కంటెస్టెంట్ చేసిన తర్వాత దాని రిజల్ట్ ని బట్టి పార్టీ ని ఉంచాలా తీసేయాలా అనే విషయం మీద ఆయన ఒక క్లారిటి కి వచ్చే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం తన భార్య తన మీద పెట్టిన కేసుని ఆయన ఎలా ఎదుర్కొంటాడు. భార్యకి రాజకీయంగా అండగా నిలుస్తున్న వాళ్లను ఎలా ఎదురించి నిలబడతాడనేది చూడాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version