Homeఎంటర్టైన్మెంట్Vijay Antony Emotional Speech: స్టేజి మీద ఎమోషనల్ అయిపోయిన హీరో విజయ్ ఆంటోనీ.. దగ్గరకు...

Vijay Antony Emotional Speech: స్టేజి మీద ఎమోషనల్ అయిపోయిన హీరో విజయ్ ఆంటోనీ.. దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టిన సతీమణి.

Vijay Antony Emotional Speech: తెలుగు, తమిళ భాషల్లో మంచి ఇమేజ్ , క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోల్లో ఒకరు విజయ్ ఆంటోనీ. ‘బిచ్చగాడు’ చిత్రంతో ఆరోజుల్లో విజయ్ ఆంటోనీ సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 100 రోజులు మాత్రమే కాదు , 175 రోజులకు పైగా ఈ చిత్రం ఆరోజుల్లో ఆడింది. దాదాపుగా పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ , విజయ్ ఆంటోనీ కి తెలుగు , తమిళ భాషల్లో బిచ్చగాడు తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ మాత్రం పడలేదు. మధ్యలో కొన్ని సినిమాలు యావరేజ్ రేంజ్ లో ఆడాయి కానీ , అవి ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టలేదు , కలెక్షన్స్ పరంగా కూడా అంతంత మాత్రం గానే వచ్చాయి. అందుకే ఇప్పుడు ‘బిచ్చ గాడు’ రేంజ్ హిట్ కోసం విజయ్ ఆంటోనీ ఆ చిత్ర డైరెక్టర్ శశి తో చేతులు కలిపాడు.

వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘వంద దేవుళ్ళు’. ఈ నెల 19 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ కి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ముఖ్య అతిథి గా విచ్చేసింది. అయితే ఈ ఈవెంట్ లో విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయింది. విజయ్ గురించి గొప్పగా చెప్తూ దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇలా విజయ్ ఆంటోనీ సతీమణి గతంలో ఎప్పుడూ కూడా స్టేజి పై ఎమోషనల్ అవ్వలేదు.

ముందుగా విజయ్ ఆంటోనీ సతీమణి ఫాతిమా మాట్లాడుతూ విజయ్ తనకు భర్త మాత్రమే కాదని , తనకీ ఇప్పటికీ ఆయన లవర్ అంటూ చెప్పుకొచ్చింది. తాము ప్రతీ రోజు ఎదో ఒక విషయం లో గొడవ పడుతూనే ఉంటామని, కానీ ఎప్పటికీ ఒకరిపై మరొకరికి ప్రేమ ఇసుమంత కూడా తగ్గదని , పెరుగుతూనే ఉంటుందని చెప్పుకొచ్చింది. తనకు తండ్రి , తమ్ముడు ఎవ్వరూ లేరని , అన్నీ నేను విజయ్ లోనే చూసుకుంటున్నాను అంటూ ఆమె బాగా ఎమోషనల్ అయిపోయింది. తనని ఇంటికి మాత్రమే పరిమితం చేయకుండా, నిర్మాతని చేసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించే స్థాయిలో నన్ను నా భర్త నిలిపాడని, ఇలాంటి భర్త ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను అంటూ విజయ్ ని దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టింది. ఇంకా ఆమె ఏమేమి మాట్లాడిందో ఈ క్రింది వీడియో లో చూడండి.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular