Prabhas Health Condition : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి టాలీవుడ్ సెలెబ్రెటీల పర్సనల్ లైఫ్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తాడు. వాళ్ళ జాతకాలు చెప్తుంటారు. కొంతమంది సెలెబ్రెటీలు ఆయనతో పరిహార పూజలు కూడా చేయించుకున్నారు. అయితే గతంలో వేణు స్వామి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పైన కొన్ని కామెంట్స్ చేశారు. సలార్ మూవీ కూడా హిట్ కాదని ఆయన చెప్పారు. అయితే డిసెంబర్ 22న విడుదలైన సలార్ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. అధిరిపోయే వసూళ్లతో బాక్స్ ఆఫీస్ రికార్డులను కొల్లగొడుతుంది.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సలార్ సైతం ఫ్లాప్ అంటూ కామెంట్స్ చేసిన వేణు స్వామి ని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయితే తన పై వస్తున్న ట్రోలింగ్ మీద వేణు స్వామి స్పందించారు. తనని ట్రోల్ చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో వేణు స్వామి .. తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను విడుదల చేసాడు.
అందులో ఇలా రాసుకొచ్చాడు .. ” ఒరేయ్ ఆస్ట్రేలియా ఆజాము .. సూపర్ స్టార్ అంటే విడుదలైన సినిమాల్లో 90 శాతం సినిమాలు హిట్లు కొట్టడం. అంతేగాని విడుదలైన నాలుగు సినిమాల్లో ఒక హిట్టు కొడితే ఏం అనాలి రా ఆజాము ఆస్ట్రేలియా ఆజాము .. నాలుగు సినిమాల్లో ఒక్క సినిమా హిట్టు కొట్టడం కాదు రా ఆజాము ఆస్ట్రేలియా .. అంటూ రాసుకొచ్చాడు.
అలాగే ప్రభాస్ కి పెద్ద సర్జరీ జరిగిందని అందుకే మూడు నెలలు ఇండియా లో లేడు అని వేణు స్వామి అన్నారు. సలార్ ప్రమోషన్స్ కి రాకపోవడానికి కూడా అదే కారణమని అని చెప్పారు. అది మీడియాకు కూడా తెలియకుండా ఉంచారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. అయితే నేను 2027 లో టాలీవుడ్ హీరోలు చనిపోతారు అని చెప్పాను .. అది వచ్చేదాకా ఆగాలిగా” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియోలో వేణు స్వామి ప్రభాస్ ఫ్యాన్స్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.