Aadarsha Kutumbam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విక్టరీ వెంకటేష్ ఎలాంటి సినిమా చెయ్యబోతున్నాడు అని సోషల్ మీడియా లో చర్చలు జరుగుతున్న సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేయబోతున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేసి అందరినీ సర్ప్రైజ్ కి గురి చేశారు. ‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ఇది. ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మార్కెట్ లో మంచి బజ్ ఉంది. ఇకపోతే ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ముహూర్తం ఫిక్స్ చేసిన కవిత
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో పూజ హెగ్డే కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. గతం lo త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘అరవింద సమేత’, ‘అలా వైకుంఠపురంలో’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ సమయం లో త్రివిక్రమ్ కి, పూజ హెగ్డే కి మధ్య ప్రేమాయణం నడుస్తుంది అంటూ సోషల్ మీడియా లో రూమర్స్ ఒక రేంజ్ లో ప్రచారం అయ్యింది. ‘గుంటూరు కారం’ చిత్రం లో కూడా ముందుగా పూజా హెగ్డే ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆమెపై చాలా సన్నివేశాలు కూడా తెరకెక్కించారు. కానీ ఆమెకు బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లు రావడం తో టాలీవుడ్ ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే ‘గుంటూరు కారం’ నుండి కూడా తప్పుకుంది. అప్పటి వరకు ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఫిక్స్ అయినా శ్రీలీల ని పూజ హెగ్డే స్థానం లోకి తీసుకొని మెయిన్ హీరోయిన్ గా చేశారు.
అయితే ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత వీళ్లిద్దరు రీ యూనియన్ అవ్వడం తో సోషల్ మీడియా లో నెటిజెన్స్ త్రివిక్రమ్ మాజీ ప్రేయసి తో మళ్లీ సినిమా చేయబోతున్నాడు అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దీనిపైనే సోషల్ మీడియా లో చర్చ నడుస్తోంది. ఇకపోతే గతం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ తో మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు చేశాడు. ఈ సినిమాలకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , స్టోరీ, డైలాగ్స్ ని అందించాడు. మళ్లీ ఇన్నాళ్లకు వీళ్ళ కాంబినేషన్ రాబోతుంది. ఈసారి మాత్రం స్క్రీన్ ప్లే రైటర్ గా కాదు, డైరెక్టర్ గా త్రివిక్రమ్ పని చేయబోతున్నాడు. మరి ఈ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ రేంజ్ హిట్ గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.