Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh 2nd Song: 'ఎత్తరా..ఎత్తరా..కాలరే ఎత్తరా' అంటున్న పవర్ స్టార్..లీక్ అయిన 'ఉస్తాద్...

Ustaad Bhagat Singh 2nd Song: ‘ఎత్తరా..ఎత్తరా..కాలరే ఎత్తరా’ అంటున్న పవర్ స్టార్..లీక్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2వ పాట!

Ustaad Bhagat Singh 2nd Song: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ వచ్చే నెల 26న ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్లను ఒక్కొక్కటిగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ పాటకు ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ పాటకు దాదాపుగా 50 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ట్యూన్ చాలా రొటీన్ గా ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ వేసిన డ్యాన్స్ స్టెప్పులు అదిరిపోవడంతో ఈ పాట బాగా హిట్ అయ్యింది. రెండవ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ శివరాత్రి కానుకగా రెండవ పాట విడుదల అవుతుందని అన్నారు, కానీ ఇంతలోపే ఈ పాట సోషల్ మీడియా లో లీక్ అయిపోయింది.

ఎక్కడి నుండి లీక్ అయ్యిందో, ఎవరు లీక్ చేశారో తెలియదు కానీ, మూవీ టీం మొత్తం ఈ పాట లీక్ అయ్యినందుకు షాక్ లో ఉంది. 16 న విడుదల చేయబోయే పాట ఇది కాదట. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సాంగ్ ని విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఇంతలోపే ఈ పాట ఇలా లీక్ అవ్వడం తో మేకర్స్ కి అసలు ఏమి చెయ్యాలో అర్థం అవ్వని పరిస్థితి ఏర్పడింది. ‘ఎత్తు ఎత్తు..కాలరే ఎత్తు’ అంటూ సాగే ఈ పాట మంచి ఊపు మీద ఉంది. డ్యాన్స్ అదరగొట్టే రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ కి ఈమధ్య కాలం లో ఇలాంటి ఊర మాస్ బీట్ ఉన్న సాంగ్ పడలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలైతే ఈ మ్యూజిక్ కి థియేటర్ టాప్ లేచిపోయే రేంజ్ స్టెప్పులు వేస్తారు.

మరి పవన్ కళ్యాణ్ ఆ రేంజ్ స్టెప్పులు వేస్తాడా అనే సందేహం కొంతమందిలో ఉంది. అలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అన్ని పాటలకు డ్యాన్స్ స్టెప్పులు ఇరగదీశాడని టాక్. ఇప్పటికే మీరంతా ‘దేఖ్ లేంగే సాలా’ పాటలో ఆయన వేసిన డ్యాన్స్ స్టెప్పులను చూసే ఉంటారు. అంతకు మించిన డ్యాన్స్ స్టెప్పులు ఈరోజు లీక్ అయిన పాటలో ఉంటాయట. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఈ పాట సినిమాకు పెద్ద హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఫ్యాన్స్ కి అయితే ఈ పాట తెగ నచ్చేసింది, మరి సాధారణ మ్యూజిక్ లవర్స్ కి ఈ పాట నచ్చుతుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular