Homeఎంటర్టైన్మెంట్TVK party AI Campaign Video: ప్రచారం లో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన...

TVK party AI Campaign Video: ప్రచారం లో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన TVK పార్టీ.. AI ని ఇలా కూడా వాడొచ్చా.. వీడియో వైరల్

TVK party AI Campaign Video: సరిగా మరో 10 రోజుల్లో తమిళనాడు లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు ఏ రేంజ్ లో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నాయి మన కళ్లారా చూస్తూనే ఉన్నాము. ప్రధాన పార్టీలు అయినటువంటి DMK , AIDMK పార్టీలు ఎక్కడా తక్కడం లేదు. బూత్ లెవెల్ లో బలమైన క్యాడర్ ఉన్నటువంటి ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోరు నడుస్తోంది. అయితే తొలిసారి ఎన్నికలలో పోటీ చేయబోతున్న తమిళ సూపర్ స్టార్ విజయ్(Thalapathy Vijay) TVK పార్టీ కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఎన్నికల ప్రచారం లో విజయ్ చేస్తున్న ఫీట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మన అందరికీ తెలిసిందే. విజయ్ దురాభిమానుల పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం లో ఏవేవి చేశాడో , వాటిని రీమేక్ చేస్తున్నాడని ప్రచారం చేస్తున్నారు.

దానికి విజయ్ అభిమానులు కూడా చాలా బలమైన కౌంటర్లు వేస్తున్నారు. ఇకపోతే రీసెంట్ గానే విజయ్ జాతీయ రహదారి లో సైకిల్ తొక్కుతూ అభిమానులకు అభివాదం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ వీడియో తో పాటు మరో వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది. విజయ్ ఇంత తక్కువ సమయం లో తమిళనాడు మొత్తాన్ని కవర్ చేయడం చాలా కష్టం. అందుకే TVK పార్టీ కి చెందిన కొంతమంది అభ్యర్థులు , AI ని ఉపయోగించి , వర్చువల్ గా విజయ్ ని తమ ఎన్నికల ప్రచారం లోకి వచ్చి మాట్లాడుతున్నట్టుగా క్రియేట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. టెక్నాలజీ ని ఇలా వాడుకోవడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది.

అంతే కాకుండా విజయ్ అభిమానులు కూడా దీన్ని డిఫరెంట్ పద్దతిలో ప్రమోట్ చేస్తున్నారు. యువత మొత్తం చూస్తున్నారు కదా, టెక్నాలజీ ని ఏ విధంగా వాడుతున్నారు అనేది. అధికారం లోకి రాకముందే ఈ రేంజ్ లో టెక్నాలజీ ని ఉపయోగిస్తున్నాం , ఇక అధికారం లోకి వచ్చిన తర్వాత ఏ రేంజ్ లో టెక్నాలజీ ని ఉపయోగిస్తామో మీరే ఊహించుకోండి. కాబట్టి మా TVK పార్టీ కి ఓటు వేయండి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇకపోతే విజయ్ పార్టీ కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ? అనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చలు నడుస్తోంది. చాలా సర్వేలు చెప్పేది ఏమిటంటే , విజయ్ తాను పోటీ చేస్తున్న పెరంబూర్ , త్రిచి లో గెలవడం కూడా కష్టమే అని అంటున్నారు. ఓటు షేర్ ఓవరాల్ గా 8 నుండి 10 శాతం నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version