Homeఅంతర్జాతీయంHormuz Strait History India Trade: హర్ముజ్ జల సంధికి.. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనకు ఏంటి సంబంధం.....

Hormuz Strait History India Trade: హర్ముజ్ జల సంధికి.. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనకు ఏంటి సంబంధం.. వెలుగులోకి సంచలననిజం

Hormuz Strait History India Trade: ఇరాన్, అమెరికా యుద్ధం గురించి ప్రతిరోజు మనం వార్తలు వింటూనే ఉన్నాం. ఏదో ఒక రకమైన విషయాన్ని తెలుసుకుంటూనే ఉన్నాం. ఇరాన్, అమెరికా యుద్ధానికి సంబంధించిన వార్తలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ హర్ముజ్ జల సంధి గురించి ప్రస్తావన వస్తూనే ఉంది. వాస్తవానికి ఇది మామూలు జల సంధి కాదు. ప్రపంచ వర్తకానికి.. ప్రముఖంగా చెప్పాలంటే ఇరాన్ దేశానికి సంబంధించిన ఆర్థిక రంగానికి కీలకమైన వనరు.

హర్ముజ్ జల సంధికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ జల సంధి ప్రపంచానికి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రసాదించింది. వ్యాపారం, వాణిజ్య కార్యకలాపాలకు కీలకంగా నిలిచింది. దక్షిణాది రాష్ట్రాలకు కీలకమైన వారధిగా కొనసాగింది. కాకతీయుల పరిపాలన కాలంలో.. శ్రీకృష్ణదేవరాయల హయాంలో ఈ జల సంధి ప్రస్తావన ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు.

రాయలవారు పరిపాలిస్తున్న కాలంలో శ్రీనాథ కవి సార్వభౌముడు తాను రచించిన సాహిత్యంలో ఈ జల సంధిని హురుమాంజి అని ప్రస్తావించాడు. దీని ద్వారా అనేక రకాలుగా వ్యాపారాలు సాగినట్టు తాను రాసిన హర విలాసంలో శ్రీనాథుడు ప్రస్తావించాడు. నాటి రాయలవారి కాలంలో తిప్పయ్య శెట్టి అనే వ్యాపారి హర్ముజ్ జల సంధి నుంచి అనేక రకాలైన వస్తువులను తెచ్చి అమ్మేవాడని శ్రీ నాథుడు ప్రస్తావించారు. ఇరాన్ దేశంలో పండే బాదాం.. ఖర్జూర.. ఇతర ఎండు ఫలాలను అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చి అమ్మేవాడని శ్రీ నాథుడు తన గ్రంథంలో ప్రస్తావించాడు. శ్రీకృష్ణదేవరాయలు తన పరిపాలన కాలంలో రాజ్యానికి అవసరమైన గుర్రాలను ఇరాన్ దేశం నుంచి తెప్పించుకునే వారని.. నాడు భారీ పడవల మీదుగా గుర్రాలు వచ్చేవని.. వాటి రవాణాలో హర్ముజ్ జల సంధి కీలక పాత్ర పోషించేదని తెలుస్తోంది. అముక్తమాల్యదలో కూడా హర్ముజ్ జల సంధి ప్రస్తావన ఉంది. కాకతీయుల కాలంలో హర్ముజ్ నుంచి అనేక వస్తువులు మోటుపల్లి, మచిలీపట్నం ఓడరేవులకు సరఫరా అయ్యేవి.

పర్షియన్ సంస్కృతి

ఇరాన్ దేశంలో పర్షియన్ సంస్కృతి ఉంటుంది. 15వ శతాబ్దంలో తెలుగు సాహిత్యంలో పరిషత్ సాంస్కృతి ప్రస్తావన ఉంది. వాస్తవానికి గ్రీస్ నాగరికత అత్యంత ప్రాచీనమైనది. అయినప్పటికీ పర్షియన్ సాంస్కృతి అనేక దేశాలకు విస్తరించింది. మాంసాహార వంటకాలు.. బిర్యానీలు.. డబుల్ కా మీఠా.. తందూరి రోటీలు.. బాదుషా, జిలేబి.. ఇలా చెప్పుకుంటే ఎన్నో వంటకాలు పర్షియన్ ప్రాంతాల నుంచి ఇక్కడికి దిగుమతి అయ్యాయి. ఆ తర్వాత మన వంటకాలలో ప్రధాన భాగంగా మారిపోయాయి.

నాటి కాలంలో రాజులను పర్షియన్ సంస్కృతి విపరీతంగా ప్రభావితం చేసేది. రాయలవారు పర్షియన్ పాలకుల విధానాన్ని ఎక్కువగా అనుకరించేవారు. తన అమూక్త మాల్యదలో కూడా ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అంతేకాదు ఆ మీరు అనే పదానికి అమర నాయకుడని.. సుల్తాన్ అనే పదానికి సూరత్రాన అనే పదాలను శ్రీకృష్ణదేవరాయలు వాడుకుల తీసుకొచ్చారు. రాయలవారు పరిపాలిస్తున్న కాలంలో పర్షియన్ ప్రాంతానికి.. విజయనగర ప్రాంతానికి విస్తృతంగా రాకపోకలు సాగేవి. పర్షియన్ ప్రాంతాల నుంచి వ్యాపారవేత్తలు ఇక్కడికి వచ్చి లావాదేవీలు కొనసాగించేవారు. చాలామంది వ్యాపారులు విజయనగరంలో స్థిరపడ్డారు. అక్కడి నుంచి ఎండుఫలాలు వస్తే.. ఇక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలు ఎక్కువ చేసేవారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version