Homeఎంటర్టైన్మెంట్Bharata Varsha Teaser Review: గోపీచంద్ 'భరత వర్ష' టీజర్ రివ్యూ : ఈ రేంజ్...

Bharata Varsha Teaser Review: గోపీచంద్ ‘భరత వర్ష’ టీజర్ రివ్యూ : ఈ రేంజ్ కంటెంట్ అసలు ఊహించలేదు భయ్యా..

Bharata Varsha Teaser Review: విలన్ గా ఒక మంచి పేరు సంపాదించిన తర్వాత, మళ్లీ హీరో గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవ్వడం అనేది సాధారమైన విషయం కాదు. గతంలో చిరంజీవి, రజినీకాంత్ , మోహన్ బాబు వంటి వారికి మాత్రమే అది సాధ్యం అయ్యింది. అయితే నేటి జనరేషన్ లో విలన్ గా ఒక రేంజ్ పాపులారిటీ ని సంపాదించి , ఆ తర్వాత హీరో గా మారి , హిట్టు మీద హిట్టు కొడుతూ మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న నటుడు గోపీచంద్. ఒకానొక సమయం లో ఈయన స్టార్ హీరోల లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి అడుగు దూరం లో ఉండేవాడు. అలాంటి సక్సెస్ లను అందుకున్న గోపీచంద్ ఇప్పుడు వరుసగా డిజాస్టర్స్ ని అందుకుంటూ మార్కెట్ మీద పట్టు పోగొట్టుకున్నాడు. ఆయన గత చిత్రం ‘విశ్వం’ బాక్స్ ఆఫీస్ వద్ద పర్లేదు అనే రేంజ్ రన్ ని సొంతం చేసుకుంది.

ఈ చిత్రం తర్వాత ఆయన ఒక భారీ బడ్జెట్ మూవీ చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ సినిమా పేరు ‘భరత వర్ష’. చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసినప్పుడు , గోపీచంద్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేలా ఉన్నాడు. ఇలాంటి సినిమాలే ఆయన నుండి కోరుకునేది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. నేడు టైటిల్ ని రివీల్ చేస్తూ , విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మారుతున్న జనరేషన్ కి తగ్గట్టుగా గోపీచంద్ తనని తానూ అప్డేట్ చేసుకున్నాడని , రొటీన్ కమర్షియల్ సినిమాల మూస నుండి ఆయన ఎట్టకేలకు ఈ చిత్రం తో బయటపడ్డాడని , కచ్చితంగా ఈ సినిమాతో ఆయన భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని, మంచి కం బ్యాక్ ఇవ్వబోతున్నాడని గ్లింప్స్ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేస్తున్నారు.

ఇండియన్ హిస్టరీ లో ఎవరికీ తెలియని ఒక చాప్టర్ గురించి ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ చూపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రం టైటిల్ కి క్యాప్షన్ గా ‘ది సాగా ఆఫ్ శూల ‘ అని పెట్టారు. టీజర్ లోని విజువల్స్ కూడా చాలా హై క్వాలిటీ తో ఉన్నాయి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. నేషనల్ అవార్డు విన్నర్ సంకల్ప్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో, ఈ గ్లింప్స్ వీడియో ని చూసిన తర్వాత గోపీచంద్ అభిమానుల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడింది. అంతా బాగానే ఉంది కానీ, ఈ గ్లింప్స్ లోని ఒక ఫైట్ షాట్ ‘సలార్’ చిత్రం లోని కాఠీరమ్మ ఫైట్ నుండి కాపీ కొట్టినట్టుగా అనిపించిందని కొంతమంది నెటిజెన్స్ అంటున్నారు. ఇకపోతే ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా టీజర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము , చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి.

 

 

BharataVarsha – Saga of Shula | Title Glimpse |T Gopichand, Ritu Varma| Sankalp|Srinivasaa Chitturi

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper
Exit mobile version