https://oktelugu.com/

మరోసారి వార్తల్లోకి టీవీ9.. రజినీకాంత్‌ వైదొలిగాడా..?

తెలుగు రాష్ట్రాల్లో నంబర్‌‌ వన్‌ న్యూస్‌ చానల్‌గా వెలుగొందుతున్న టీవీ9లో రోజుకో కీలక పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. కొద్ది రోజులుగా ఆ మీడియాలో గ్రూపుల కొట్లాట నడుస్తూనే ఉందన్న టాక్ వినిపిస్తోంది. కొత్త యాజమాన్యం చేతుల్లోకి తీసుకున్నాక ఆ చానెల్‌ మాజీ సీఈవో రవిప్రకాష్‌ను బయటకు పంపించేశారు. తదుపరి ఆయన కోటరీ నుంచి ఒక్కొక్కరిని బయటికి పంపిస్తూనే ఉన్నారన్న ప్రచారం మీడియా వర్గాల్లో సాగుతోంది. Also Read: రైతులకు మోదీ శుభవార్త.. మరో 5 వేలు రైతుల […]

Written By:
  • NARESH
  • , Updated On : September 24, 2020 3:27 pm
    Follow us on

    తెలుగు రాష్ట్రాల్లో నంబర్‌‌ వన్‌ న్యూస్‌ చానల్‌గా వెలుగొందుతున్న టీవీ9లో రోజుకో కీలక పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. కొద్ది రోజులుగా ఆ మీడియాలో గ్రూపుల కొట్లాట నడుస్తూనే ఉందన్న టాక్ వినిపిస్తోంది. కొత్త యాజమాన్యం చేతుల్లోకి తీసుకున్నాక ఆ చానెల్‌ మాజీ సీఈవో రవిప్రకాష్‌ను బయటకు పంపించేశారు. తదుపరి ఆయన కోటరీ నుంచి ఒక్కొక్కరిని బయటికి పంపిస్తూనే ఉన్నారన్న ప్రచారం మీడియా వర్గాల్లో సాగుతోంది.

    Also Read: రైతులకు మోదీ శుభవార్త.. మరో 5 వేలు రైతుల ఖాతాల్లో జమ..?

    ప్రస్తుతం టీవీ9లో రజనీకాంత్‌, మురళీకృష్ణల మధ్య సిబ్బంది రెండు వర్గాలుగా వీడిపోయారని ఇన్ సైడ్ టాక్. కొత్త యాజమాన్యం చానల్‌ను చేతుల్లోకి తీసుకున్నాక సంస్థ మొత్తం బాధ్యతలను రజనీకాంత్‌కు అప్పజెప్పారు. తన శక్తి మేర రవిప్రకాష్ బ్రాండ్‌ను తొలగించి టీవీ9 స్థానాన్ని కాపాడటంలో రజనీకాంత్ కూడా సక్సెస్ అయ్యారు. కానీ చాలా కాలంగా టీవీ9 కొత్త యాజమాన్యం ఒక విభిన్నమైన వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తోంది.

    రవిప్రకాష్‌ టీంగా పేరున్న వారిపై కొత్త యాజమాన్యం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. సమయం చూసి ఇప్పటికే కొందరిని బయటికి పంపింది. అందులో భాగంగానే కొద్ది రోజులుగా మురళీకృష్ణకు ఎలివేషన్ ఇస్తున్నారట. 10 టీవీ నుంచి కొంత మందిని తీసుకొచ్చి మురళీకృష్ణకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారట. చివరికి రజనీకాంత్‌కు పొగ పెట్టేశారని సమాచారం. అప్పటికి రజనీకాంత్.. యాజమాన్య రాజకీయ ఆసక్తులను గమనించి దానికి తగ్గట్లుగా అదే స్ట్రాటజీ కొనసాగించారు. విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.

    Also Read: అవినీతి ఏసీపీ.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

    తాజాగా.. రజనీకాంత్‌ టీవీ9 నుంచి వైదొలిగినట్లు మీడియా వర్గాల్లో టాక్‌. అయితే.. ఈ ప్రక్షాళన టీవీ9లో ఇప్పట్లో ఆగేలా లేదనేది సమాచారం. రజినీకాంత్ కు నమ్మినబంటుగా ఉండే పాత టీంలోని ప్రతీ మెంబర్‌‌ను బయటకు పంపించడమే యాజమాన్యం లక్ష్యంగా చెప్పుకొస్తున్నారు. ఎలాగైతేనేం బ్రేకింగ్‌ న్యూస్‌లకు కేరాఫ్‌ అయిన టీవీ9 మరోసారి వార్తల్లోకెక్కడం కొసమెరుపు.