Tollywood Heroines: చిత్రసీమ రంగుల ప్రపంచం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ మరీ ముఖ్యంగా హీరోయిన్స్ గ్లామర్ ఉన్నంత వరకే సర్వైవ్ అవుతుంటారన్న విషయాన్ని దాదాపుగా ఎవరూ కాదనలేరు. ఇకపోతే ఇక్కడ ఉండాలంటే సక్సెస్ అనేదే చాలా ముఖ్యంగా. అలా సక్సెస్ అవడంతో పాటు గ్లామర్ ఉంటే కనుక వారికి అవకాశాలు కలిసొస్తాయి. అయితే, అలా సక్సెస్ రావడానికి హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ ప్లే చేయడంతో పాటు స్టోరిలో కంటెంట్ ఉండేలా జాగ్రత్త పడాలి. అలా స్టోరి సెలక్షన్ సరిగా చేసుకుంటేనే వారు కొంత కాలమైనా చిత్రసీమలో నిలబడుతారు. లేదంటే అక్కడే ఆగిపోతుంటారు. అలా సరైన స్క్రిప్ట్ సెలక్షన్ చేసుకోలేకపోయి కెరీర్ మధ్యలోనే ఆగిపోయిన హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం.
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మెగాస్టార్ చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన ‘చిరుత’ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ.,. ఆ తర్వాత పత్త లేకుండా పోయింది. ఈ సినిమా తర్వాత ఈ భామ ‘కుర్రాడు’ అనే ఫిల్మ్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లేచేసింది. కాగా, ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇక ఆ తర్వాత ఈ సుందరి కనబడకుండా పోయింది. దివంగత హీరో ఉదయ్ కిరణ్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘నువ్వునేను’లో నటించిన అనిత హంసనందిని.. ఆ తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్ లో పొరపాట్లు చేయడం వలన తర్వాత కెరీర్ లో హీరోయిన్ గా నిలబడలేకపోయింది.
Also Read: Tollywood Heroines: ఈ హీరోయిన్స్‌కు వారి తల్లులే నరకం చూపించారట.. ఆస్తి కోసం ఇంత దారుణమా..!
పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇడియట్’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రక్షిత.. ఆ పిక్చర్ తో మంచి పేరు సంపాదించుకుంది. ఈ ఫిల్మ్ తర్వాత రక్షిత ‘ఆంధ్రావాలా, నిజం’ చిత్రాల్లో కథనాయికగా నటించింది. కానీ, పిక్చర్స్ బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో రక్షిత తర్వాత కనబడకుండా పోయింది. మరో ముద్దుగుమ్మ ఇషా చావ్లా..‘ప్రేమ కావాలి’ చిత్రంతో మంచి హిట్ అందుకుంది.
కుర్రకారు ఈ భామ గ్లామర్‌ను చూసి ఆమెనే ఫేవరెట్ హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయారు. అయితే, ఈ సుందరి ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా వరుస ఫ్లాప్స్ కావడంతో తర్వాత హీరోయిన్ గా కనబడకుండా పోయింది. సీనియర్ హీరోయిన్ రాధా కూతురు కార్తీక.. నాగచైతన్య ‘జోష్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం అనుకున్న రేంజ్ లో ఆడలేదు. దాంతో ఈ భామ కోలీవుడ్ లో ‘రంగం’ ఫిల్మ్ చేసింది. అది సూపర్ హిట్ అయింది. అయితే, తెలుగులో తర్వాత కాలంలో ‘దమ్ము’ చిత్రం చేసింది. కానీ, అది డిజాస్టర్ కావడంతో ఇక ఈ సుందరి హీరోయిన్ గా మళ్లీ తెలుగు చిత్రాల్లో కనబడలేదు. అను ఇమ్మాన్యుయేల్, నందిత రాజ్, హెబ్బా పటేల్ కూడా అంతే..
Also Read: Tollywood Heroines: భయంకర వ్యాధులతో చావు అంచుల వరకు వెళ్లి బయటపడ్డ హీరోయిన్స్ వీళ్లే..