Two Nani’s guilty: జగన్మోహన్ రెడ్డి కొత్త క్యాబినేట్ కూర్పు అనేక రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకొని జరిగింది. పాత, కొత్త మేళవింపుగా ఏపీ కొత్త క్యాబినేట్ ఏర్పడిన సంగతి అందరికీ తెల్సిందే. అయితే ఈ మంత్రివర్గంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తుండటం గమనార్హం. మాట తప్పను.. మడప తిప్పను అనే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఆశావహులకు మొండిచేయి చూపించడం గమనార్హం.
రెండున్నరేళ్ల తర్వాత క్యాబినేట్ మార్పు ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ముందుగానే ప్రకటించారు. సెకండ్ క్యాబినెట్లో 90శాతం వరకు కూడా కొత్తవారికే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. ఇందుకు తగ్గట్టుగానే వైసీపీ ఎమ్మెల్యేలంతా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. తీరా పదవుల పంపకం వచ్చేసరికే మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రతిభ కంటే కుల సమీకరణాలనే ఫాలో అయ్యారు.
ప్రస్తుత క్యాబినేట్లో 11మందిని పాతవారిని తీసుకున్నారు. విధేయత, సీనియారిటీని ప్రతిపాదికగా తీసుకొని ఈ పదకొండు మందికి జగన్మోహన్ రెడ్డి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డికి వీరవిధేయులైన కొడాలి నాని, పేర్ని నానిలు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా కొడాలి నాని లేని జగన్ క్యాబినేట్ ను వైసీపీ శ్రేణులు ఊహించుకోలేక పోతున్నాయి.
గత మంత్రివర్గంలో కొడాలి నాని పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన తన శాఖపై సమీక్షల కంటే కూడా అధిష్టానం చెప్పినట్లుగానే నడుచుకునే వారు. చంద్రబాబును దూషించడంలో కొడాలి నాని స్టైల్ వేరుగా ఉండేది. అసెంబ్లీలో టీడీపీ నేతలను చెడుగుడు ఆడుకోవడంలో కొడాలి నానిని ఎదురులేదని చెప్పొచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి వీరవిధేయుడిగా ఉండేవారు.
జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఆయన కారు డ్రైవర్ గా కూడా పని చేస్తానంటూ బాహాటంగా కొడాలి నాని ప్రకటించారు. అలాంటిది ఆయనకు జగన్ క్యాబినేట్లో చోటు దక్కకపోవడం విడ్డూరంగా మారింది. కేవలం కమ్మ సామాజిక వర్గానికి మంత్రి పదవీ అవసరం లేదనే కొడాలి నాని పక్కన పెట్టారని తెలుస్తోంది. కొడాలి నానిని కులం ప్రతిపాదికన కాకుండా సొంత మనిషిగానైన పదవీ ఇవ్వలేరా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
పేర్ని నాని విషయకొస్తే మంత్రిగా తనకు శాఖకు న్యాయం చేయడంతోపాటు ప్రభుత్వాన్ని సమర్ధించడంలో ముందుండేవారు. మంచి వాగ్దాటి కలిగిన పేర్ని నాని అసెంబ్లీలో, మీడియా ఎదుట తనదైన స్టెల్లో ప్రత్యర్థులను టార్గెట్ చేసేవారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై విరుచుకు పడటంలో పేర్ని నాని స్టెలే వేరు అన్నట్లుగా ఉండేది.
జగన్మోహన్ రెడ్డి పెద్ద పాలేరుగా ఉంటానని పేర్ని నాని సైతం తన విధేయతను బాహాటంగానే చాటుకున్నారు. ఆయనకు సామాజిక సమీకరణం కూడా కలిసి వస్తోంది. అయినా కూడా పేర్ని నాని పక్కన పెట్టడం వెనుక కారణమెంటో అంతుచిక్కడం లేదు. ఏదిఏమైనా నిత్యం జగన్ నామస్మరణ చేసే ఇద్దరు నానిలను సీఎం ఎందుకు దూరం చేసుకున్నారో ఆయనకే తెలియలి మరీ..!