Sarkaru Vaari Paata Pre Release Business: వరుసగా హ్యాట్రిక్ హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకి చేరుకొని వచ్చే నెల 12 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది, ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించిన పాటలు మరియు టీజర్ కి అటు అభిమానుల నుండి ఇటు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో ఈ సినిమా కి ట్రేడ్ సర్కిల్ లో ఒక్క రేంజ్ క్రేజ్ ఏర్పడింది..మహేష్ బాబు సినిమా యావరేజి గా ఉన్నా కూడా 100 కోట్ల రూపాయిల షేర్ అవలీలగా వసూలు చేస్తాయి..దీనితో సర్కారు వారి పాట సినిమాకి డిస్ట్రిబ్యూటర్ సర్కిల్ లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది..ఎంత డబ్బులు చేసిన బయ్యర్లు ఈ సినిమాకి ఇచ్చి కొనుక్కోవడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు, మే 12 వ తేదీన విడుదల కాబోతుండడం తో ఈ సినిమాకి అప్పుడే నిర్మాతలు థియేటర్స్ బుక్ చెయ్యడం కూడా ప్రారంభించేసారు..ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రాంతాల వారీగా ఎలా జరిగిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

మహేష్ బాబు కి నైజాం ప్రాంతం లో మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మన అందరికి తెలిసిందే..ఆయన నటించిన ఆఖరి మూడు సినిమాలు నైజం ఏరియా లో అద్భుతమైన వసూళ్లను రాబట్టి మహేష్ స్టామినా ఏమిటో మరోసారి అందరికి అర్థం అయ్యేలా చేసింది..దీనితో సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ ప్రాంతం లో దాదాపుగా 30 కోట్ల రూపాయలకు జరిగింది..సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అందుకునే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా..ఇక ఈ సినిమాకి కోస్తాంధ్ర లో కూడా మంచి డిమాండ్ ఉంది అనే చెప్పాలి..భీమ్లా నాయక్ మరియు పుష్ప సినిమాలు విడుదల సమయం లో ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్స్ సమస్య ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..దానికి తోడు అదనపు షోస్ కి అనుమతి కూడా లేదు..ఈ రెండు సినిమాలు రోజుకి కేవలం నాలుగు ఆటలు మీదనే నడిచింది, కానీ రాధే శ్యామ్ సినిమా నుండి టికెట్ రేట్స్ పెంచుకోడానికి ప్రభుత్వం అనుమతిని ఇచ్చిన ఈ నేపథ్యం లో సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ కోస్తా ఆంధ్ర లో దాదాపుగా 42 కోట్ల రూపాయలకు బిజినెస్ క్లోజ్ అయ్యింది అని సమాచారం.
Also Read: రాజమౌళి పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రశాంత్ నీల్
ఇక రాయలసీమ ప్రాంతం లో కూడా ఈ సినిమాకి మంచి డిమాండ్ ఉంది అనే చెప్పాలి..ఈ ఏరియా లో ఈ సినిమా హక్కులు 15 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది, మొత్తం మీద రెండు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా దాదాపుగా 90 కోట్ల రూపాయిల వరుకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది..ఇక మహేష్ బాబు కి ఓవర్సీస్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఒక్క మాటలో చెప్పాలి అంటే మన టాలీవుడ్ కి ఓవర్సీస్ మార్కెట్ ఓపెన్ చేసిన హీరో మహేష్ బాబు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..అలాంటి మహేష్ బాబు సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అవుతుంది అంటే ఓవర్సీస్ లో ఎలాంటి డిమాండ్ ఉంటుందో ఊహించుకోవచ్చు..ఆ డిమాండ్ కి తగ్గట్టుగానే ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను 13 కోట్ల రూపాయలకు మైత్రి మూవీ మేకర్స్ వారు అమ్మినట్టు సమాచారం.. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 110 కోట్ల రూపాయలకు జరిగి ఉంటుంది అని అంచనా.
Also Read: నాగ చైతన్య కి చుక్కలు చూపించిన హైదరాబాద్ పోలీసులు