Guntur Kaaram trailer త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ప్రొడ్యూసర్ గా వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా ఈనెల 12 వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని నిన్న రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఇంతకుముందు త్రివిక్రమ్ సినిమాలు ఎలాగైతే ఉంటాయో అలాంటి పంథా లోనే సాగుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.
నిజానికి మహేష్ బాబు ఈ సినిమాలో చేసిన ఈ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే మహేష్ బాబు చెప్పిన డైలాగులు కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. ఇక ఇదంతా చూస్తుంటే మహేష్ బాబు ఈ సినిమాలో వన్ మ్యాన్ షో చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈయన అభిమానులకు అయితే ట్రైలర్ చూసినప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు జనవరి 12వ తేదీ ఎప్పుడు వస్తుంది అని ఎదురుచూస్తున్నారు.ఇక దానికి తగ్గట్టు గానే వాళ్ళు చేసే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్ అన్న నిన్ను ఎవడు ఆపలేడు అంటూ సోషల్ మీడియా మొత్తం కామెంట్లు పెట్టి నింపేస్తున్నారు.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ మొదట్లోనే మహేష్ బాబు కంట్లో నిప్పురవ్వ పడ్డట్టుగా చూపించారు. దాంతో మహేష్ బాబు కంటికి సంబంధించిన సమస్యని ఈ సినిమాలో ఎదుర్కోబోతున్నాడనే హింట్ అయితే ఇచ్చారు.
దానికి సంబంధించినట్టుగానే మహేష్ బాబు హీరోయిన్ ని చూసేటప్పుడు ఒక కన్ను మూసుకొని ఇంకో కంటితో చూస్తాడు. అంటే ఆయనకి ఉన్న కంటి సమస్యను ప్రధానంగా చేసి త్రివిక్రమ్ ఈ సినిమాలో ఎమోషన్ ని పండించబోతున్నట్టుగా తెలుస్తుంది. త్రివిక్రమ్ సినిమాలో పెద్ద సీన్లు ఏమి లేకుండా చిన్న చిన్న సీన్ లలో ఉండే ఎమోషన్ ని హైలెట్ చేస్తూ వాటిని ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించి సినిమాలను సక్సెస్ చేస్తూ ఉంటాడు…
ఇక ఈ సినిమాలో కూడా అదే విధానాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన సినిమాల్లో ఉండే హ్యూమర్ గాని, ఆ డైలాగ్ డెలివరీ గాని, కామెడీ పంచులు గాని ఈ సినిమాలో కూడా ఉన్నట్టుగా అర్థమవుతుంది. మరి ఈ సినిమాతో వీళ్లిద్దరి కాంబినేషన్ లో భారీ సక్సెస్ పడుతుందా లేదా అనేది తెలియాలంటే 12వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…