KCR: బీజేపీ గెలుపు: కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు.. గుండె పరీక్షల కోసం ఆస్పత్రికి.. బీజేపీ సెటైర్లు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడ్డాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించగా.. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే జాతీయ స్థాయిలో చెలరేగిపోయి బీజేపీని ఓడిద్దామని కలలుగన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశలు నెరవేరలేదు. కేసీఆర్ జాతీయ అరంగేట్రానికి ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు బ్రేక్ వేసినట్టయ్యాయి. కేంద్రంలో మరోసారి మోడీ రాబోతున్నారని ఈ సెమీఫైనల్స్ లాంటి ఫలితాలతో తేటతెల్లమైంది. తెలంగాణ […]

Written By: NARESH, Updated On : March 11, 2022 1:41 pm
Follow us on

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడ్డాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించగా.. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే జాతీయ స్థాయిలో చెలరేగిపోయి బీజేపీని ఓడిద్దామని కలలుగన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశలు నెరవేరలేదు. కేసీఆర్ జాతీయ అరంగేట్రానికి ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు బ్రేక్ వేసినట్టయ్యాయి. కేంద్రంలో మరోసారి మోడీ రాబోతున్నారని ఈ సెమీఫైనల్స్ లాంటి ఫలితాలతో తేటతెల్లమైంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు యాదాద్రి పర్యటన పెట్టుకున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం చేయాల్సి ఉండేది. ఆలయ ప్రారంభానికి సమయం సమీపిస్తుండడంతో క్షేత్ర పర్యటనకు వెళ్లాలని భావించారు.11 గంటలకు యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే లక్ష్మీనారసింహుల కల్యాణ మహోత్సవంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున స్వామి వారికి కేసీఆర్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని పేర్కాన్నారు.

అయితే సడెన్ గా కేసీఆర్ కు గుండె పరీక్షల నిమిత్తం యశోద ఆస్పత్రికి వెళ్లినట్లు తెలంగాణ సీఎంవో అధికారికంగా తెలిపింది. గుండెకు సంబంధించిన పరీక్షల నిమిత్తంగా ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారని.. రెండు రోజులుగా ఒంట్లో కాస్త ఇబ్బందిగా ఉండడంతో ఇవాళ ఉదయం ప్రగతిభవన్ నుంచి సోమాజిగూడలోని యశోధ ఆస్పత్రికి వెళ్లారు. నిన్నటి నుంచి ఎడమ చేతి లాగుతున్నట్లుగా అనిపిస్తోందని.. నీరసంగా ఉన్నారని సమాచారం.

డాక్టర్ ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం కేసీఆర్ కు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కు హార్ట్ యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన వెంట కేసీఆర్ సతీమణి శోభ, కూతురు కవిత, సంతోష్, మనవడు హిమాన్స్ ఉన్నారు.

ఇక తండ్రి, సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురికావడంతో మంత్రి కేటీఆర్ ఉప్పల్ పర్యటనను ముగించుకొని యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఈ విషయం తెలిసి టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆరాతీస్తున్నారు. ఆస్పత్రికి పోటెత్తారు. అస్వస్థత కారణంగానే కేసీఆర్ యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం.

అయితే కేసీఆర్ కు గుండె సమస్యలపై తెలంగాణ బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపు చూసి.. బీజేపీ కొట్టిన దెబ్బకు కేసీఆర్ ‘అబ్బా’ అన్నాడని.. అందుకే గుండెనొప్పి లేచిందని ఎద్దేవా చేస్తున్నారు. కేసీఆర్ అస్వస్థతను రాజకీయంగా వాడుకుంటూ బీజేపీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.