https://oktelugu.com/

Pregnancy: ప్రెగ్నెన్సిలో ఏ ఫుడ్స్ తింటే.. పిల్లలు తెలివిగా పుడతారో మీకు తెలుసా?

గర్భిణులు తినే ఫుడ్ బట్టి పిల్లలు పుడతారని కొందరు నిపుణులు అంటుంటారు. అందులోనూ పిల్లలు తెలివిగా పుట్టాలంటే గర్భిణులు తప్పకుండా కొన్ని ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పదార్థాలేంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 24, 2024 / 06:17 AM IST

    Pregnancy

    Follow us on

    Pregnancy: గర్భం దాల్చినప్పటి నుంచి మహిళలు ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తినే ఆహారం నుంచి చేసే ప్రతి పనిలో కూడా జాగ్రత్త వహిస్తారు. తల్లి కావడం అనేది గొప్ప వరం. ఇలాంటి సమయంలో మహిళలు జాగ్రత్త వహించక తప్పదు. గర్భిణిగా ఉన్నప్పుడు మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. వాంతులు, సరిగ్గా ఫుడ్ తినాలనిపించకపోవడం, మలబద్దకం, వెన్నునొప్పి వంటి సమస్యలన్ని కనిపిస్తాయి. ఈ సమయంలో మహిళలు పోషకాలు ఉండే ఆహారాలు మాత్రమే తినాలి. ఎందుకంటే ఆ ఫుడ్ బట్టి పిల్లలు ఆరోగ్యంగా పుడతారని వైద్య నిపుణులు చెబుతుంటారు. సాధారణంగా గర్భిణులు మానసిక, శారీరక సమస్యలతో కాస్త ఇబ్బంది పడతారు. అయితే ఈ సమస్యలన్నీ ఎవరికైనా సాధారణమే. గర్భంతో ఉన్నప్పుడు ఎవరు ఏ ఆరోగ్య జాగ్రత్తలు చెప్పిన పాటిస్తుంటారు. అయితే గర్భిణులు తినే ఫుడ్ బట్టి పిల్లలు పుడతారని కొందరు నిపుణులు అంటుంటారు. అందులోనూ పిల్లలు తెలివిగా పుట్టాలంటే గర్భిణులు తప్పకుండా కొన్ని ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పదార్థాలేంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    ఆకుకూరలు
    గర్భిణులు ఎక్కువగా ఆకుపచ్చని కూరగాయలు తినాలి. వీటిని తినడం వల్ల పిల్లలు తెలివిగా, ఆరోగ్యంగా పుడతారు. ఈ ఆకుపచ్చని కూరగాయల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఇది తల్లి, బిడ్డ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ గర్భిణులకు మలబద్ధకం నుంచి విముక్తి కలిగిస్తుంది. డైలీ ఆకుకూరలు తినడం వల్ల అందులోని పోషకాలు కడుపులోని బిడ్డకు కూడా అందుతాయి. దీంతో ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు.

    చేపలు
    ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే సాల్మన్, సార్డినెస్ చేపలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు పిల్లల మెదడును మెరుగుపరుస్తుంది. గర్భం దాల్చినప్పుడు తినడం వల్ల ఆ పోషకాలు పిల్లలకు అందుతాయి. కేవలం కడుపులో ఉన్న బిడ్డకే కాకుండా తల్లి ఆరోగ్యానికి కూడా మంచిదే.

    డ్రైఫ్రూట్స్
    బాదం, పిస్తా, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్‌లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. వీటిని డైలీ తినడం వల్ల పుట్టే పిల్లలు తెలివిగా పుడతారు. అలాగే ఇవి పిల్లల ఆరోగ్యానికి కూడా బాగా సహాయపడతాయి. వీటిని డైలీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల తక్షణమే శక్తి కూడా లభిస్తుంది.

    క్యారెట్
    స్వీట్ పొటాటో, క్యారెట్, బీట్‌రూట్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా పుట్టడంతో పాటు తెలివిగా పుడతారు. ఇవి పుట్టబోయే పిల్లలతో పాటు తల్లి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో కొలైన్, విటమిన్లు, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి.

    కోడిగుడ్లు
    ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ​కోడి గుడ్లను తినడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో పోషకాలు గర్భిణులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వీటితో పాటు బీన్స్, సిట్రస్ పండ్లు, బీన్స్ వంటివి కూడా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.