టీడీపీ ఎమ్మెల్యేకు వైసీపీలో మంత్రి పదవా?

రాజకీయాల్లో ‘యూజ్ అండ్ త్రో’ పాలసీ బాగా ఉంటుంది. ఏ పార్టీ నుంచి గెలిచినా అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు ఎలాంటి సిగ్గూ ఎగ్గూ లేకుండా చేరిపోతుంటారు. ఇక చంద్రబాబు, కేసీఆర్ లాంటి రాజకీయ పార్టీల అధినేతలు ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను కూడా లాగేసి మంత్రి పదవులు ఇస్తుంటారు. చంద్రబాబు అయితే సమకాలీన రాజకీయాల్లో నేతలను వాడుకొని వదిలేసినట్టు వేరే ఎవ్వరూ అలా చేయరని మోత్కుపల్లి నర్సింహులు, భూమా అఖిలప్రియ లాంటి వారు ఎందరో ఆడిపోసుకున్నారు.. మరిన్ని […]

Written By: NARESH, Updated On : October 31, 2020 11:30 am
Follow us on

రాజకీయాల్లో ‘యూజ్ అండ్ త్రో’ పాలసీ బాగా ఉంటుంది. ఏ పార్టీ నుంచి గెలిచినా అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు ఎలాంటి సిగ్గూ ఎగ్గూ లేకుండా చేరిపోతుంటారు. ఇక చంద్రబాబు, కేసీఆర్ లాంటి రాజకీయ పార్టీల అధినేతలు ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను కూడా లాగేసి మంత్రి పదవులు ఇస్తుంటారు. చంద్రబాబు అయితే సమకాలీన రాజకీయాల్లో నేతలను వాడుకొని వదిలేసినట్టు వేరే ఎవ్వరూ అలా చేయరని మోత్కుపల్లి నర్సింహులు, భూమా అఖిలప్రియ లాంటి వారు ఎందరో ఆడిపోసుకున్నారు..

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

అయితే ఈ రాజకీయాల్లోనూ జగన్ శైలి విభిన్నం. ఆయన తనతోపాటు ఆది నుంచి ఉన్న వారికి అందలం ఇచ్చాడు. పార్టీ అధికారంలోకి రాగానే వారికే మొదట పదవులు ఇచ్చారు. వైసీపీ కోసం పాటుపడ్డ కమెడియన్ పృథ్వీకి తిరుమల తిరుపతి దేవస్థానం టీవీ (ఎస్వీబీసీ) చానెల్ చైర్మన్ పదవిని ఇచ్చారు. ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ గా పార్టీ పెట్టినప్పటి నుంచి తనతో పాటు ఉన్న విజయ్ చందర్ కు ఇచ్చారు.ఇక తన బాబాయ్, వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ చేశారు. విజయసాయిరెడ్డికి ఢిల్లీ వ్యవహారాలు అప్పగించారు. ఇక సలహాదారులుగా నమ్మిన వారిని నియమించారు. ఎన్నికల్లో ఓడిపోయినా తనకు నమ్మినబంట్లుగా ఉన్నందుకు మోపిదేవి, పిల్లి సుభాష్ లను మంత్రులను చేశారు. ఇప్పుడు రాజ్యసభకు పంపారు.తనను , పార్టీని నమ్ముకొని ఉన్న కొత్తగా గెలిచిన శ్రీకాకుళం అప్పలరాజును కూడా మంత్రిని చేసిన ఘనత జగన్ సొంతం.

Also Read: విశాఖలో వైసీపీకి ఉన్న బలం ఇదే..!

కానీ ఇప్పుడు టీడీపీ బురదలో అంటించుకున్న మురికిని జగన్ కు అంటించాలని చూస్తోందన్న టాక్ నడుస్తోంది.. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తున్నాడని.. ఆయనకు జగన్ మంత్రి పదవి ఇస్తున్నాడని టీడీపీ మీడియా హోరెత్తిస్తోంది. ముఖ్యంగా టీడీపీ సోషల్ మీడియా పనిగట్టుకొని ప్రచారం చేస్తోంది. అది కూడా విశాఖకు చెందిన గంటా ప్రత్యర్థి, వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ను తొలగించి గంటాకు మంత్రి పదవిని జగన్ ఇస్తున్నాడని టీడీపీ బ్యాచ్ ప్రచారం చేస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే జగన్ మంత్రి పదవిని ఇచ్చి వైసీపీ మంత్రిని బలి చేస్తున్నారని టీడీపీ సోషల్ మీడియా హోరెత్తిస్తోంది.

Also Read: అల్లుళ్ల కోసం గిళ్లక తప్పదు బాలయ్యా..!

నిజానికి జగన్ కు ఇలాంటి అవసరం కానీ.. ఇలాంటి ఆలోచన కానీ లేదు. నమ్మిన వారికి ప్రాణమిచ్చే జగన్… ఇలా టీడీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తాడంటే అదో పెద్ద జోక్ అని చెప్పక తప్పదు. జగన్ పార్టీలోకి రావాలంటే ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీల నేతల రాజీనామా చేయాల్సిందే.. రాజీనామా చేస్తేనే వారిని పార్టీలో చేర్చుకుంటారు. మళ్లీ పోటీచేయించి గెలిపిస్తారు. కానీ చంద్రబాబులా ఎమ్మెల్యేలను లాగేసి వారు ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారైనా మంత్రి పదవులు కట్టబెట్టడం జగన్ కు అలవాటు లేదు. అలాంటి పనులు కూడా చేయడు. గతంలో చంద్రబాబు 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాగితే వారిని మళ్లీ జగన్ చేర్చుకోలేదు. వారిపై ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోగా.. ఒక్కరూ కూడా మళ్లీ గెలవలేదు. ఫిరాయింపులను విమర్శించిన జగన్ అలా చేస్తాడని ఎవ్వరూ ఊహించరు. కానీ ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా జగన్ కు మరక అంటించాలని చూస్తోంది.