https://oktelugu.com/

‘ఉప్పెన సక్సెస్ ఎఫెక్ట్’: హీరోయిన్ కు 25 లక్షలు, హీరోకు కోటి బోనస్?

ఈ ఇండస్ట్రీలో సక్సెస్ యే మాట్లాడుతుంది.. సక్సెస్ యే నడిపిస్తుంది. అందుకే సక్సెస్ వెంటనే టాలీవుడ్ పరిగెడుతుంది. హిట్ అయితే నెత్తిన పెట్టుకుంటుంది.. ఫ్లాప్ అయితే అధ: పాతాళానికి నెట్టివేస్తుంది. ఇప్పుడు అస్సలు అంచనాలు లేకుండా కొత్త హీరో హీరోయిన్లతో రిలీజ్ అయిన ‘ఉప్పెన’ మూవీ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. ఈ క్రమంలోనే నిర్మాతలకు కాసుల వర్షం కురిసింది. ఉప్పెన సినిమాలో హీరో, హీరోయిన్లు, దర్శకుడు ముగ్గురు కొత్తవారే. మెగా హీరో వైష్ణవ్ తేజ్, […]

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2021 / 07:59 PM IST
    Follow us on

    ఈ ఇండస్ట్రీలో సక్సెస్ యే మాట్లాడుతుంది.. సక్సెస్ యే నడిపిస్తుంది. అందుకే సక్సెస్ వెంటనే టాలీవుడ్ పరిగెడుతుంది. హిట్ అయితే నెత్తిన పెట్టుకుంటుంది.. ఫ్లాప్ అయితే అధ: పాతాళానికి నెట్టివేస్తుంది. ఇప్పుడు అస్సలు అంచనాలు లేకుండా కొత్త హీరో హీరోయిన్లతో రిలీజ్ అయిన ‘ఉప్పెన’ మూవీ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. ఈ క్రమంలోనే నిర్మాతలకు కాసుల వర్షం కురిసింది.

    ఉప్పెన సినిమాలో హీరో, హీరోయిన్లు, దర్శకుడు ముగ్గురు కొత్తవారే. మెగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతికి ఇది తొలి సినిమా. అందుకే వైష్ణవ్ కు కేవలం 50 లక్షలు.. కృతికి కేవలం 10 లక్షలు మాత్రమే పారితోషికం ఇచ్చారట..

    అయితే ఊహించని విధంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ స్పందించినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. హీరో, హీరోయిన్లు ఇద్దరికీ బోనస్ గా మరోసారి పారితోషికం అందించినట్టు సమాచారం. సినిమాకు లాభాల పంట పండడంతో హీరో వైష్ణవ్ కు కోటి రూపాయలు, హీరోయిన్ కు పాతిక లక్షలు ఎక్స్ ట్రా పారితోషికం అందించారట.. అయితే దీనిపై అధికారికంగా మైత్రీ మూవీ మేకర్స్, హీరో హీరోయిన్లు స్పందించలేదు. కేవలం టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

    దీంతో ఈ అనూహ్య పరిణామానికి హీరో, హీరోయిన్లు అవాక్కయ్యారట.. తొలి సినిమాతో కాసుల పంట కురిపించుకున్న ఈ ఇద్దరు లక్కీ అనే చెప్పొచ్చు.