
జిల్లా పాలనకు కేంద్ర బిందువైన కలెక్టరేట్‌లో ఓ ఉన్నత హోదాలో పనిచేస్తున్న అధికారి ఆయన. అంతటి హోదాలో ఉండి కూడా చిల్లర వేషాలు వేశాడు. తన బుద్ధిని పోనిచ్చుకోలేదు. తన కింద పనిచేసే మహిళా ఉద్యోగిపై కన్నేశాడు. సుపీరియర్‌ను కదా ఏం చేసినా చెల్లుతుందని అనుకున్నాడు. ఆ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించాడు. అది ఇస్త.. ఇది ఇస్తా అంటూ ఎరవేశాడు. కానీ.. చివరికి ఆ గుట్టు వెలుగులోకి వచ్చే ప్రమాదం కనిపించడంతో కాళ్లు మొక్కి సైలెంట్‌గా కాంప్రమైజ్ చేయించుకున్నాడు.
Also Read: బలం జనసేనది.. తిరుపతి బరి బీజేపీదా?
‘నువ్వు నాకు కూర వండుకురా. నువ్వు నాకు సహకరిస్తే.. నేను నీకు సహకరిస్తా’ అంటూ ఆ అధికారి ఆ మహిళ పట్ల వెకిలిగా ప్రవర్తించాడు. అయితే.. ఈ అధికారికి చాపల పులుసుకు కూడా విడదీయరాని అనుబంధం ఉందంట. ఎందుకంటే ఈయన వరంగల్ చేపల మార్కెట్లో కూడా మూడేళ్ల క్రితం చేపలు అమ్మే ఓ మహిళ పట్ల కూడా ఇలాగే అసభ్యకరంగా ప్రవర్తించాడట. దీంతో అక్కడి జనాలు కూడా ‘పులుసు కారేలా’ బడిత పూజ చేసినట్లు సమాచారం. అక్కడ కూడా ఎక్కడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుందోనని.. ఉద్యోగం పోతుందనే భయంతో రాజీ కుదుర్చుకున్నాడట.
ఇతడి సైకో మెంటాలిటీకి కరీంనగర్ ప్రెస్ భవన్ వెనుక గల ఓ కార్యాలయంలో పనిచేసినప్పుడు కూడా దేహశుద్ధి జరిగినట్టు ఆరోపణలున్నాయి.. ఒక ఫుల్ బాటిల్, రూ.15 వేలు ఇస్తే పశువుల కాపరికైనా, ఇటుకబట్టీల్లో పనిచేసే ఒరిస్సా కూలీలకైనా “ప్రెస్ అక్రి.. కార్డు” ఇస్తాడని ఆరోపణలు ఉన్నాయి. ఓ జిల్లాలోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో పనిచేసే ఇద్దరు పర్మినెంట్ ఉద్యోగులకు ఈ పద్ధతిలోనే ఆ లాభం చేకూర్చే కార్డ్స్ ఇచ్చినట్టు తెలిసింది.
అయితే.. ఇన్ని జరిగినా అతని బుద్ధిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదట. పెద్దపల్లి కలెక్టరేట్‌కు వచ్చాక కూడా తన క్యారెక్టర్‌ను మరోసారి బయటపెట్టాడు. ఆ మహిళా ఉద్యోగికి అసభ్యకరంగా మెస్సేజ్‌లు పెడుతూ వేధించాడు. అర్ధరాత్రుల్లో చాటింగ్‌లు చేశాడు. ఆయనపై మహిళ ఫిర్యాదు చేసింది.
Also Read: రఘురామరాజుకు షాకులు.. ఆలస్యమైందా..?
దీంతో సదరు మహిళతో కాంప్రమైస్ కాకుంటే.. లైంగిక వేధింపుల కేసులో బుక్కై జైలుకు వెళ్లడమే కాక ఉద్యోగం ఊడి పోయే ప్రమాదం ఉందని గ్రహించిన సదురు అధికారి కాళ్ల బేరానికి వెళ్లాడట.. భయపడి ఆ మహిళ కాళ్లు మొక్కి కాంప్రమైస్ అయ్యాడని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం పోలీసుల దాకా వెళ్లకుండా పలువురు సహకరించినట్లుగా ప్రచారం సాగుతోంది.
ఎట్టకేలకు ఈ వ్యవహారం ఆనోటా.. ఈనోటా మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వెంటనే పక్క జిల్లా జగిత్యాలకు బదిలీ చేశారు. జగిత్యాలకు పనిష్‌మెంట్‌పై వెళ్లిన ఆయన.. అక్కడైనా సక్రమంగా డ్యూటీ చేస్తాడా..? లేక ‘కుక్క తోక వంకర’ అన్నట్లు అదే వక్రబుద్ధి ప్రదర్శిస్తాడా.? అన్నది చూడాలి మరి.