Sunny Leone: భారతీయ వెండితెర పై శృంగార తారగా ఎంట్రీ ఇచ్చిన సన్నీ లియోన్ తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ పోతూ ఉంది. అయితే, ఇప్పుడు సన్నీ లియోన్ ని అరెస్ట్ చెయ్యాలంటూ డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సన్నీ లియోన్ కి వ్యతిరేకంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్ కారణంగా ప్రస్తుతం సన్నీ లియోన్ ట్రెండింగ్ టాపిక్ అయిపోతుంది.

కొంతమంది బీజేపీ నాయకులు కూడా సన్నీ లియోన్ ను అరెస్ట్ చేయాలని ఇప్పటికే పబ్లిక్ గా చెబుతున్నారు. ఈ గొడవ అంతా దేనికి ? ఉన్నట్టు ఉండి అందరూ సన్నీ లియోన్ పైన ఎందుకు పడ్డారు ? అంటే.. సన్నీ లియోన్ నటించిన ఒక పాట బాగా వివాదాస్పదం అయింది. ఇంతకీ సన్నీ లియోన్ ఎలాంటి పాటలో నటించింది అంటే.. “మధుబన్ మే రాధ” అనే పాటలో.
Also Read: Jakie Shroff: జ్యోతిష్యాన్ని అవహేళన చేయద్దంటున్న బాలీవుడ్ స్టార్ జాకీ
ఆమె ఆ పాటలో కనబడగానే.. నెటిజన్లు ఆ పాటను తెగ వైరల్ చేస్తున్నారు. నిజానికి అది శ్రీకృష్ణుడి కోసం రాధ పాడే భక్తి గీతం. 1960లో విడుదలైన కోహినూర్ అనే సినిమాలో మహ్మద్ రఫీ పాడిన ఆ పాటని సన్నీ లియోన్ పై లేటెస్ట్ గా రీమిక్స్ చేసి జనం పైకి వదిలారు. ఒక భక్తి గీతాన్ని ఒక శృంగార తార పై ఎలా తీస్తారు ? అసలు ఆ శృంగార తార ఆ భక్తి గీతంలో ఎలా నటిస్తోంది ? అంటూ హిందుత్వ వాదులు సన్నీ లియోన్ పై విరుచుకుపడుతున్నారు.
అయినా భక్తి గీతం అయితే ఏమి ? మరో గీతం అయితే ఏమి ? ఏ.. సన్నీ లియోన్ ఎందుకు అలాంటి గీతంలో నర్తించకూడదు ? సన్నీ లియోన్ మనిషి కాదా ? నిజానికి శ్రీకృష్ణుడు కూడా అనేక భార్యలతో సంబంధాలు కలిగి ఉన్నాడు కదా.. మరి సన్నీ లియోన్ ఇక ఆ పాటలో నటిస్తే.. ఆ పాట అపవిత్రం అయిపోయిందా ? నిజమే కావొచ్చు. ఆ పాటలో సన్నీ లియోన్ వేసిన డ్యాన్సులు, ఆమె హొయలు అసభ్యంగా ఉండొచ్చు.
కానీ, అందులో హిందువుల మనోభావాలు దెబ్బ తినడం ఏమిటో అర్ధం కావడం లేదు. ఒక శృంగార తారగా ఒక పాటలో కనిపించి ఆకట్టుకోవడం సన్నీ లియోన్ బాధ్యత. తన బాధ్యత తానూ నిర్వర్తించింది. దానికి బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ఆమెని అరెస్ట్ చెయ్యాలని అడగడం మంచి పద్దతి కాదు.