Sudagali sudhir : ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ కమెడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయమై నేడు ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారు. వారిలో ముఖ్యంగా హైపర్ ఆది, షకలక శంకర్ మరియు చమ్మక్ చంద్ర వంటి కమెడియన్స్ నేడు ఇండస్ట్రీ లో ఏ స్థానం లో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.వీళ్లందరికంటే జబర్దస్త్ షో ద్వారా ఒక స్టార్ హీరో కి సరిసమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న కమెడియన్ సుడిగాలి సుధీర్.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన సుడిగాలి సుధీర్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.ఒకానొక దశలో సుడిగాలి సుధీర్ లేనిదే ఈటీవీ లో ఎంటర్టైన్మెంట్ షోస్ ఉండేవి కాదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు,ఆ రేంజ్ లో ఆయన తన డిమాండ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.
అయితే పక్క చానెల్స్ వారు ఈటీవీ కంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పడంతో సుడిగాలి సుధీర్ ఈటీవీ ని వదిలి వెళ్ళిపోయాడు.కొద్దిరోజులు ఆయన స్టార్ మా ఛానల్ లో పలు షోస్ చేసాడు,దాంతో పాటు పలు సినిమాల్లో హీరో గా కూడా చేసాడు.మొదటి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ గా నిలిచినప్పటికీ, గత ఏడాది విడుదలైన ‘గాలోడు’ చిత్రం మాత్రం సూపర్ హిట్ గా నిల్చింది.ఇక సుధీర్ కి వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తాయి, ఇక ఆయనకీ ఎదురు లేదు అని అందరూ అనుకున్నారు.
కానీ కథ అడ్డం తిరిగింది,సుడిగాలి సుధీర్ కి ప్రస్తుతం చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ లేవు, మరోపక్క బుల్లితెర మీద షోస్ లేవు, సినిమాల్లో కమెడియన్ రోల్స్ కూడా దూరం అయ్యాయి.దీనితో అధిక డబ్బు వస్తుందనే అత్యాశతో సుడిగాలి సుధీర్ ఈటీవీ నుండి బయటకి వచ్చి తన కెరీర్ ని తానే చేతులారా నాశనం చేసుకున్నాడు అని అంటున్నారు విశ్లేషకులు.