
Pawan Kalyan movies : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూ మరోపక్క రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇటీవలే ఆయన సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేస్తున్న సినిమాని పూర్తి చేసాడు.ఈ చిత్రం తో పాటుగా ఆయన చాలా కాలం నుండి ‘హరి హర వీరమల్లు’ సినిమా కూడా చేస్తున్నాడు.ఇవి రెండు కాకుండా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు ‘OG ‘ వంటి సినిమాలను కూడా ఒప్పుకున్నాడు.
వీటిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ఏప్రిల్ 5 వ తారీఖు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ 90 రోజుల కాల్ షీట్స్ ని ఇచ్చారు, వాటిలో పది రోజుల కాల్ షీట్స్ కి సంబంధించిన షెడ్యూల్ ఏప్రిల్ 5 నుండి ప్రారంభం కానుంది.
ఏప్రిల్ 5 నుండి 15 వ తారీఖు వరకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ లో పాల్గొననున్న పవన్ కళ్యాణ్,ఆ తర్వాత ఏప్రిల్ నెలలోనే ‘హరి హర వీరమల్లు’ మూవీ చివరి షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు.అన్నీ అనుకున్నట్టు కుదిరితే ‘హరి హర వీరమల్లు’ సినిమా అక్టోబర్ 5 వ తారీఖున విడుదల కాబోతున్నట్టు సమాచారం.మరో పక్క పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం జులై 28 వ తారీఖున విడుదల కానుంది.
ఇదంతా పక్కన పెడితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా వచ్చే దాడి సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుందని ఫిలిం నగర్ లో బలంగా వినిపిస్తున్న టాక్.అంటే పవన్ కళ్యాణ్ మూడు నెలల గ్యాప్ తేడా తో మూడు సినిమాలు విడుదల చెయ్యబోతున్నాడు అన్నమాట.ఏడాది కి ఒకే ఒక్క సినిమాని విడుదల చేసే పవన్ కళ్యాణ్ నుండి ఇప్పుడు ఒకే ఏడాది లో మూడు సినిమాలు రాబోతుండడం విశేషం.