Homeఎంటర్టైన్మెంట్Movie Budget: స్టార్ హీరోల సినిమాలకు కావాల్సింది బడ్జెట్ కాదు కథ...

Movie Budget: స్టార్ హీరోల సినిమాలకు కావాల్సింది బడ్జెట్ కాదు కథ…

Movie Budget: సినిమా ఇండస్ట్రీలో హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న స్టార్ హీరోలందరు తమదైన రీతిలో ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది దర్శకులు సైతం మంచి కథ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మన స్టార్ హీరోలు డిఫరెంట్ కథలవైపు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి ఒక హీరో సక్సెస్ ఫుల్ సినిమాని చేయాలంటే బడ్జెట్ పెంచాల్సిన అవసరం లేదు. ముందు కథలో దమ్ము ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే సినిమాలు సక్సెస్ ని సాధిస్తాయని మరికొంతమంది భావిస్తున్నారు. నిజానికి భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించినప్పుడు మాత్రమే అవి పెద్ద సినిమాలుగా మారతాయని అలాంటి సినిమాలను ప్రేక్షకులు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారని చాలామంది భావిస్తుంటారు. కానీ అలా ఎంత మాత్రం కాదు.

డిఫరెంట్ కథతో ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగినప్పుడు మాత్రమే ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది. లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు… ఇక మొత్తానికైతే సినిమా సక్సెస్ కావాలి అంటే కథ బాగుండాలి లేకపోతే మాత్రం సక్సెస్ ని సాధించడం అసాధ్యం అనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ మధ్యకాలంలో మన స్టార్ హీరోలు చేస్తున్న సినిమాల విషయంలో కథలు ఏమాత్రం ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం లేదు.

కాబట్టి వాళ్లు రాబోయే రోజుల్లో డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది… చాలామంది కొత్త దర్శకుడు డిఫరెంట్ సబ్జెక్టులను రెడీ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళందరికి స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలైతే రావడం లేదు.

దానివల్ల స్టార్ హీరోలు గొప్ప కథలను మిస్ అయిపోతున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని స్టార్ హీరోలు యాంగ్ డైరెక్టర్స్ కి అవకాశాలను ఇస్తు అందరి కథలను వింటూ మంచి స్టోరీ తెచ్చినవాళ్ళతో సినిమాలు చేస్తే బాగుంటుందని మరి కొంతమంది విమర్శకులు సైతం అభిప్రాయపడుతున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version