Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీయార్, నాగేశ్వరరావు తర్వాత అంతట క్రేజ్ ని సాధించిన ఒకే ఒక్క హీరో చిరంజీవి… ఈయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. ఇక అలాంటి క్రమంలో వాళ్ల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుంటూ ఇండస్ట్రీలో తనకు కూడా ఒక చిన్న పాటి గుర్తింపు వస్తుందనే నమ్మకంతో తనని తాను డిఫరెంట్ వే లో ప్రొజెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టాడు.
మొదట చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ వస్తున్న చిరంజీవికి ఆ తర్వాత హీరోగా అవకాశం వచ్చింది. ఇక కొన్ని సినిమాల్లో తన డ్యాన్సులు, ఫైట్లు చూసిన అభిమానులు చిరంజీవి కి ఫిదా అయిపోయారు.ఇక తను వరుసగా మంచి సినిమాలు చేయడంతో మొదట సుప్రీం హీరోగా, ఆ తర్వాత మెగాస్టార్ గా ఎదిగాడు. ఇక ఈ క్రమంలోనే చిరంజీవితో చాలా మంది దర్శకులు సినిమాలను చేశారు. ఇక విజయ బాపినీడు లాంటి దర్శకుడు కూడా చిరంజీవితో మగమహారాజు అనే సినిమా చేశాడు.
అయితే ఆ తర్వాత ఆయన గ్యాంగ్ లీడర్ సినిమాని కూడా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఇప్పటివరకు కూడా కమర్షియల్ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా ఏదైనా ఉంది అంటే అది గ్యాంగ్ లీడర్ సినిమా అనే చెప్పాలి. అయితే ఈ సినిమా చేద్దామని విజయ భాపినీడు అనుకున్నప్పుడు మొదట ఈ సినిమాని వేరే హీరోతో చేయాలని అనుకున్నారట. అయితే కొంతమంది చిరంజీవితో చేయొచ్చు కదా అని సలహాలు ఇచ్చినప్పటికీ చిరంజీవికి ఇలాంటి కథ సెట్ అవదు, ఆయన ఇలాంటి పాత్రలని చేయలేడు అనే విధంగా మాట్లాడినట్టుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.
కానీ చివరికి తప్పనిసరి పరిస్థితిలో ఆ కథను చిరంజీవికి చెప్పి ఒప్పించి ఆయనతో ఆ సినిమా చేశాడు. ఇక కట్ చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా విజయ బాపినీడు ని ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మార్చేసింది. అలాగే చిరంజీవిని మెగాస్టార్ గా కూడా ప్రొజెక్ట్ చేయడంలో ఈ సినిమా చాలావరకు హెల్ప్ అయిందనే చెప్పాలి.
ఇక ఈ సినిమాలో చిరంజీవిని చూసిన అభిమానులు ఆయన నటనకి మంత్రముగ్ధులయ్యారనే చెప్పాలి. ఇక చిరంజీవి స్టామినాని చూసిన విజయ బాపినీడు షాక్ అయ్యాడట.. తన సన్నిహితుల దగ్గర చిరంజీవి ని నేను తక్కువగా అంచనా వేశాను అని కూడా చెప్పాడట…