Srinivasa Mangapuram Trailer Review: మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం ‘శ్రీనివాస మంగపురం’. RX100 , మంగళవారం వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తెరకెక్కించిన అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆడియన్స్ లో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈయన నుండి రాబోతున్న సినిమా అంటే , కచ్చితంగా అంచనాలు ఉంటాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, ఈ సినిమా పై కనీస స్థాయి అంచనాలు కూడా లేవు. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి డిజాస్టర్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ మొత్తం మీద హైలైట్ గా అనిపించింది ఏదైనా ఉందా అంటే , అది మోహన్ బాబు మాత్రమే.
పవర్ ఫుల్ యాక్షన్ తో తన స్టైల్ లో మోహన్ బాబు డైలాగ్స్ కొడుతూ అదరగొట్టేసారు . కానీ హీరో జయ కృష్ణ , రషా తందాన్ మాత్రం తీవ్ర స్థాయిలో నిరాశపరిచారు. రషా తందాన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా తందాన్ కూతురు. ఈ వయస్సులో కూడా ఆమె ఎంతో అందంగా కనిపిస్తోంది. కానీ ఆమె కూతురు మాత్రం కనీస స్థాయిలో కూడా కనిపించలేదు. ఇక జయకృష్ణ విషయానికి వస్తే , ఇతని ముఖం లో ఒక్కటంటే ఒక్క ఎక్స్ ప్రెషన్ కూడా కనిపిమ్చలేదు. ఫైట్స్ లో దమ్ము లేదు , ఎనర్జీ లేదు. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఆకట్టుకోలేదు. ఓవరాల్ గా ట్రైలర్ లో ఇతన్ని చూస్తుంటే హీరో గా మాత్రమే కాదు , కనీసం నటుడిగా కూడా పనికొచ్చేలా కనిపించడం లేదు. కనీసం అజయ్ భూపతి అయినా తన టేకింగ్ తో మెప్పించారా అంటే అది కూడా జరగలేదు.
ఎప్పుడో జయం కాలం నాటి లవ్ స్టోరీ ని మళ్లీ తిరిగి చేసినట్టు అనిపించింది. పాన్ ఇండియా యుగం లో ఇలాంటి నాసిరకమైన లవ్ స్టోరీస్ ఎలా ఆడుతాయి చెప్పండి?, ఓవరాల్ గా ఈ చిత్రం విడుదలకు ముందే డిజాస్టర్ అనిపించుకుంది. ఇక ఈ చిత్రాన్ని మహేష్ బాబు తన భుజాన వేసుకొని ప్రమోట్ చేసినా కూడా కష్టమే అని అనిపిస్తోంది. నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మా బాబాయ్ మహేష్ బాబు వస్తారని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. మరి మహేష్ బాబు రాకతో , ఈ సినిమా కాస్త అయినా హైప్ పెరుగుతుందో లేదో చూడాలి. ఈ చిత్రం ఈ నెల 30 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
