Shekhar And Johnny Master: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ను సాధించిన వాళ్లకు మాత్రమే గొప్ప గుర్తింపైతే ఉంటుంది. ఎవరైతే టాప్ పొజిషన్ కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ వరుస సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది. అలాగే ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేయాల్సిన అవసరమైతే ఉంది. అలాగే వాళ్ళకున్న క్రేజ్ తో ప్రేక్షకులందరిని మెప్పించగలగాలి… అలాంటి వారికి మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశమైతే ఉంటుంది. ఇక హీరోల విషయం పక్కన పెడితే కొరియోగ్రాఫర్లు సైతం ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో ఒకరిని మించిన వారు మరొకరు గా తయారవుతున్నారు. మొన్నటి వరకు శేఖర్, జానీ మాస్టర్లు టాప్ కొరియోగ్రాఫర్స్ గా కొనసాగారు. అయితే వాళ్లకి కొంచెం క్రేజ్ తగ్గడంతో రీసెంట్ గా భాను మాస్టర్ స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేసే స్థాయికి ఎదిగాడు… సీనియర్ హీరోలకు కొరియోగ్రఫీ చేస్తూనే స్టార్ హీరోలకు సైతం తన స్టెప్పులను వేయిస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో ఆయనకు చాలా మంచి పాపులారిటి అయితే దక్కింది. సాంగ్ ను బట్టి కొరియోగ్రఫీ చేస్తు మాస్టర్ ముందుకు దూసుకెళుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన స్టార్ హీరోలకు సరిపడ స్టెప్ లను మరింత ఉన్నతంగా చూపించాల్సిన అవసరమైతే ఉంది.
భాను మాస్టర్ కొరియోగ్రఫీలో స్టెప్స్ కంటే కూడా సాంగ్ థీమ్ ను ఎక్కువగా ఎలివేట్ చేస్తూ ఉంటాడు. ఆ సాంగ్ యొక్క థీమ్ ఏంటో దాన్ని ప్రేక్షకులకు ఎలా పరిచయం చేయాలనే ప్రయత్నం చేస్తుంటాడు. అందువల్లే అతనికి మంచి గుర్తింపైతే వచ్చింది…ఇకమీదట ఆయన చెబుతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.
అందుకే ప్రతి సాంగ్ విషయంలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆయన ఆ సాంగ్ కి కొరియోగ్రఫీ చేయగలుగుతున్నాడు… రీసెంట్ గా చిరంజీవి హీరోగా వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో ‘యురేకా నువ్వు కేక’ సాంగ్ కి కొరియోగ్రఫీ చేశాడు.
ఆ సాంగ్ లో చిరంజీవి వేసిన స్టెప్స్ అద్భుతంగా ఉన్నాయంటూ చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన ఇదే రేంజ్ లో ముందుకు దూసుకెళ్తే టాప్ కొరియోగ్రాఫర్ గా మారే అవకాశాలైతే ఉన్నాయి. ఇక తొందరలోనే ఆయన అనుకున్న పొజిషన్ ను అందుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
