Shambhala Movie Collection: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చాలా సంవత్సరాలు అయినప్పటికీ, కెరీర్ లో హీరో గా తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకోలేకపోయిన నటుడు ఆది సాయి కుమార్(Aadi Saikumar). తన ప్రతీ సినిమాతో ఆడియన్స్ కి సరికొత్త అనుభూతి ఇవ్వాలని తపన పడుతూ ఉంటాడు. కానీ ఎక్కడో ఒక చోట తేడా కొట్టి అవి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఎలాంటి తేడా జరగలేదు, అన్ని పర్ఫెక్ట్ గా కుదరడంతో పాటు అదృష్టం కూడా కలిసి రావడం తో ఆయన లేటెస్ట్ చిత్రం ‘శంబాలా'(Sambala Movie) కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. విడుదలై 8 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్నప్పటికీ, ఇప్పటికీ కూడా ఈ చిత్రానికి మంచి రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. నిన్న న్యూ ఇయర్ కావడంతో బుక్ మై షో లో ఈ చిత్రానికి ఏకంగా 50 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.
ఇది సాధారణమైన విషయం కాదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 8 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 2 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ ప్రాంతాలను కలిపి ఈ చిత్రానికి 8 వ రోజున 3 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అట. షేర్ వసూల్ దాదాపుగా కోటి 60 లక్షల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా 8 రోజులు పూర్తి అయ్యే సమయానికి ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 7 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 5 కోట్లు మాత్రమే.
అంటే ఇప్పటి వరకు 2 కోట్ల 60 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి అన్నమాట. ఫుల్ రన్ లో ఇంకా ఎంత లాభాలు వస్తాయో చూడాలి. ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి మంచి ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీకెండ్ లో మరో రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను ఈ సినిమా రాబడుతుందని, అదే కనుక జరిగితే ఓవరాల్ గా పెట్టిన ప్రతీ పైసాకు రెండింతల లాభాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ‘రాజాసాబ్’ వచ్చే వరకు ఈ చిత్రానికి రన్ ఉంటుంది. అంటే మరో రోజులు అన్నమాట. అప్పటి వరకు ఎంత లాభాలను ఆర్జిస్తుందో చూద్దాం.