The Rajasaab vs Mana Shankara Varaprasad Garu : మరో వారం రోజుల్లో థియేటర్స్ మొత్తం సంక్రాంతి సినిమాలతో కళకళలాడబోతున్నాయి. ఈ సంక్రాంతి సినిమాల్లో వందల కోట్ల వ్యాపారం చేసిన సినిమాలు రెండే.. ఒకటి ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(The Rajasaab), మరొకటి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu). ఈ రెండు సినిమాలకు మంచి డిమాండ్ ఉంది, కానీ రాజాసాబ్ హారర్ థ్రిల్లర్ కావడం తో భారీ బడ్జెట్ ని పెట్టారు కాబట్టి, ఈ సినిమా కు బ్రేక్ ఈవెన్ వేల్యూ చాలా పెద్దది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే దాదాపుగా అన్ని భాషలకు కలిపి 300 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. ఇక ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్ని ప్రాంతాలకు కలిపి 140 కోట్ల రూపాయలకు జరిగింది.
అంత మొత్తం మీద షేర్ వసూళ్లు వస్తే ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యినట్టే. అలా మేజర్ బిజినెస్ ఈ రెండు చిత్రాల పైనే జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ అప్డేట్ ఇప్పుడు వచ్చేసింది. ‘రాజా సాబ్’ చిత్రం ప్రీమియర్ షోస్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ 800 రూపాయిల వరకు ఉంటుందట. అదే విధంగా చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ కి ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ 500 రూపాయిల వరకు ఉంటుందట. రాజా సాబ్ ప్రీమియర్ షోస్ సాయంత్రం 6 గంటల నుండి మొదలు అవుతుందట. ఇక ‘మన శంకర వరప్రసాద్’ ప్రీమియర్ షోస్ రాత్రి 9 గంటల నుండి ఉంటుందట. అయితే రాజా సాబ్ ప్రీమియర్ షోస్ 6 గంటల ఆటతో పాటు, 9 గంటల ఆట కూడా ఉంటుందా ?, లేదా కేవలం 6 గంటల ప్రీమియ షోస్ తోనే ఆపేస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై క్లారిటీ త్వరలోనే రానుంది. ప్రస్తుతానికి అయితే ఈ డ్రాఫ్ట్ ని రెండు సినిమాలకు సంబంధించిన మేకర్స్ ప్రభుత్వాలకు పంపించారు. మరి ప్రభుత్వాలు అనుమతి ఇస్తారో లేదో చూడాలి.
#ManaShankaraVaraPrasadGaru with ₹500 Paid-premieres on Sunday, 11th January in Telugu States!#TheRajaSaab ₹800 Paid-premieres from 6PM, Thursday, 8th January!
Note : Subject to governmental clearances. pic.twitter.com/gS64cB31ff
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) January 2, 2026