Doctor Mukherjee Madivada : మగ పిల్లల కంటే ఆడపిల్లలతో తండ్రులకు అనుబంధం బలంగా ఉంటుంది. ఆడపిల్లల్లో తండ్రులు తమ అమ్మలను చూసుకుంటారు. అందువల్లే వారితో గాఢమైన బంధాన్ని పెంచుకుంటారు. కొన్ని సందర్భాలలో తమ వ్యక్తిగత విషయాలను సైతం వారితో పంచుకుంటారు. ఆడపిల్లలు కూడా తమ తండ్రులను సూపర్ హీరోలుగా భావిస్తుంటారు. తమ దృష్టిలో తండ్రులను గొప్పయోధులుగా భావిస్తుంటారు.
తన కూతురితో ఓ హైదరాబాద్ వైద్యుడికి బలమైన బంధం ఉంది. అతనితో ఆ అమ్మాయికి కూడా అదే స్థాయిలో ప్రేమ ఉంది. జనవరి ఒకటి నాడు కుటుంబం మొత్తం కలిసి భోజనం చేద్దామని.. ఆరోజున సమయానికి వస్తానని ఆ వైద్యుడు తన కూతురికి మాట ఇచ్చాడు. దీంతో ఆమె కూడా సంబరపడింది. తన తండ్రి విలువైన సమయాన్ని గడుపుతాడని భావించి గొప్పగా కుటుంబ సభ్యులతో చెప్పుకుంది. తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లాలని.. వారితో కలిసి భోజనం చేయాలని ఆ వైద్యుడు భావించాడు. కుటుంబ సభ్యులు కూడా అతని కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఇంతలోనే అనుకోని సంఘటన జరిగింది. దీంతో ఆ వైద్యుడు ఆసుపత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఫలితంగా ఆయన రాకుండానే కుటుంబ సభ్యులు భోజనం చేశారు. ఇచ్చిన మాట తప్పడంతో ఆ కూతురి బాధ వర్ణనాతీతంగా మారిపోయింది.
వాస్తవానికి ఆ వైద్యుడు ఇంటికి వెళ్లే సమయంలో ఒక కేసు వచ్చింది. ఓ వ్యక్తి తీవ్రమైన గుండెపోటుతో ఇబ్బంది పడుతున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో తన కూతురికి ఇచ్చిన మాట కంటే.. మరో కూతురి తండ్రి ప్రాణం కాపాడడం పైనే ఆ వైద్యుడు దృష్టి సారించాడు.. అంతేకాదు గుండె నొప్పితో బాధపడుతున్న ఆ వ్యక్తికి యాంజియో ప్లాస్టి నిర్వహించాడు. ఫలితంగా తనకు కూతురితో భోజనం చేయలేకపోయాడు. ఒక ప్రాణాన్ని కాపాడేందుకు.. తన కూతురికి ఇచ్చిన మాటను అతడు తప్పాడు.
” నా కుమార్తెకు వచ్చిన మాటలు నిలబెట్టుకోలేకపోయాను. కానీ ఒక రోగి ప్రాణాలను కాపాడాను. ఆ చిన్నారికి తండ్రిని ఇవ్వగలిగాను.. ఆ కుమార్తె తన ముఖ్యమైన క్షణాలను తండ్రితో ఆనందంగా గడుపుతుందని” ఆ వైద్యుడు పేర్కొన్నాడు. ఇంతకీ ఆ వైద్యుడు పేరు చెప్పలేదు కాదు.. అతని పేరు డాక్టర్ ముఖర్జీ మడివాడ. అతడు ట్విట్టర్లో ఈ పోస్ట్ చేసిన తర్వాత చూస్తుండగానే లక్షలలో వ్యూస్ దక్కించుకుంది. ఆ వైద్యుడు చూపించిన పనితీరు పట్ల అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
My daughter wanted to have lunch with me today.
On weekdays, that is almost never possible.
But today was the first of January, and I promised her I would come. Sharp at 2.00 pm.At 1.30, just as I was about to leave, a 30 year old man, Mr. Mahesh (name changed), was rushed in… pic.twitter.com/vhKAJAosCf
— Dr. Mukharjee Madivada (@drmssm) January 1, 2026