Amesha Patel: బాలీవుడ్ భామ ‘అమీషా పటేల్’ అంటే ఇప్పటి తరానికి సీనియర్ హీరోయిన్ గానే తెలుసు. కానీ, అప్పట్లో బోల్డ్ సీన్స్ తో స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో హల్ చల్ చేసిందని తెలియదు. అంతటి వైభవాన్ని అమీషా అనుభవించింది. నిజానికి ఓ దశలో పాన్ ఇండియా హీరోయిన్ గా అమీషా పటేల్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. కానీ వయసు పెరిగింది.. అవకాశాలు తగ్గాయి.

అయితే, ఈ రోజు ఈ మాజీ బ్యూటీ పెళ్లి ప్రపోజల్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. గత కొంతకాలంగా అమీషా పటేల్ దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తనయుడు ఫైజల్ పటేల్ తో ఘాటు ప్రేమలో ఉందని పుకార్లు వచ్చినా.. ఎన్నడూ వీరిద్దరూ ఆ పుకార్ల పై స్పందించలేదు. అయితే, తాజాగా ఫైజల్ 41వ బర్త్ డే సందర్భంగా ఓ పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి అమీషా కూడా వెళ్ళింది.
Also Read: మహేష్ కోసం త్రివిక్రమ్ ‘హెలికాప్టర్ల ఫైట్’ !
పార్టీలో ఏమి జరిగిందో ఏమో గానీ, పార్టీ నుంచి తిరిగి రాగానే.. ఫైజల్ కి పుట్టినరోజు విషెష్ తెలియజేస్తూ ‘హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్.. ఐ లవ్ యు’ అని అమీషా ట్వీట్ పెట్టింది. అమీషా ట్వీట్ కి ఫైజల్ స్పందిస్తూ.. ‘థ్యాంక్యూ అమీషా పటేల్. ఈ సందర్భంగా పబ్లిక్ గా నీకు ప్రపోజ్ చేస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా ?’ అని పెళ్లి ప్రపోజల్ చేశాడు.
దెబ్బకు ఈ ట్వీట్ వైరల్ అవ్వడం మొదలు పెటింది. దాంతో ఫైజల్ ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. కానీ, ట్వీట్ ను సేవ్ చేసిన నెటిజన్లు ప్రస్తుతం ఆ ట్వీట్ ను తెగ వైరల్ చేస్తున్నారు. మొత్తానికి లేటు వయసులో అమీషాకి పెళ్లి ప్రపోజల్ వచ్చింది. ఇక ఈ మధ్య అమీషాకి కాలం కలిసి రావడం లేదు. ఎలాగూ సినిమా ఛాన్స్ లు లేవు. దాంతో సైడ్ బిజినెస్ గా బోటిక్ బిజినెస్ ను స్టార్ట్ చేసింది.
ముంబైలో మొదలు పెట్టిన ఈ బిజినెస్ బాగానే నడిపింది. కానీ తన దగ్గర పనిచేస్తున్న ఓ మేనేజర్ ఆమెను మోసం చేసినట్లు తెలుస్తోంది. అందుకే బిజినెస్ లు వదిలేసి.. ప్రస్తుతం అమీషా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ వస్తోంది. ఎలాగూ అమీషా ఇప్పుడు నష్టాల్లో ఉంది. పైగా ఖాళీగా ఉంటుంది.
మరి ఇలాంటి సమయంలో ఈ బాలీవుడ్ ముదురు భామకు ఛాన్స్ లు కావాలి. అందుకే, ప్రస్తుతం సైలెంట్ గా ఛాన్స్ ల కోసం బాలీవుడ్ దర్శక నిర్మాతల చుట్టూ తిరుగుతుంది. అయితే అవకాశాలు రాలేదు గానీ, పెళ్లి ప్రపోజల్ మాత్రం వచ్చింది.
Also Read: ‘భీమ్లా నాయక్’ రావాల్సిందే అంటున్న ఫ్యాన్స్.. సినిమా రిలీజ్ అప్పుడేనా?