Sandeep Reddy Vanga: సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు డిఫరెంట్ కథలతో సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.అయితే ఆయన చేసిన సినిమాలన్నీ అలాంటి కంటెంట్ తోనే రావడం వల్ల ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు. తద్వారా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి వంగ ఇకమీదట కూడా ఇలాంటి కథలతోనే సినిమాలు చేస్తాడు అంటు తన సన్నిహిత వర్గాలవారు చెబుతున్నారు. నిజానికి ఎప్పుడు ఇలాంటి కధలతో రొటీన్ గా సినిమాలు వస్తే ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశాలైతే ఉన్నాయి.
అలా కాకుండా తన పంథాను మార్చి డిఫరెంట్ వే లో సినిమాలను చేయగలిగితే అప్పుడు ఆయన ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగే అవకాశం ఉంటుందని మరి కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన యూత్ ను టార్గెట్ చేసి మాత్రమే సినిమాలు చేస్తాడు. కాబట్టి వాళ్లకు నచ్చే అంశాలు తన సినిమాలో పుష్కలంగా ఉంటాయి.
అందువల్లే అతని సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తూ ఉంటారని కూడా మరి కొంతమంది సమాధానం చెబుతున్నారు… ప్రస్తుతం స్పిరిట్ సినిమాతో ప్రభాస్ ను నెక్స్ట్ లెవెల్లో చూపించే ప్రయత్నం చేస్తున్న సందీప్ ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడనే విషయంలో క్లారిటి లేదు. స్టార్ హీరోలందరు అతనితో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నప్పటికి తను మాత్రం ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంలో ఇంకా ఫుల్ క్లారిటీ రావడం లేదు.
ఇక ఏది ఏమైనా కూడా సందీప్ సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం ప్రతి ఒక్కరు అతని మీద విపరీతంగా విమర్శలు చేసే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న దర్శకులందరు సూపర్ హిట్లను సాధించడంలో బిజీగా ఉన్నారు…
