https://oktelugu.com/

నాగచైతన్యతో సమంతకు గొడవలు!?

సంసారం అన్నాక చిర్రుబుర్రులు.. అలకలు.. కోపాలు.. తాపాలు.. కాసిన్ని గొడవలు ఉండాలి. అలా ఉంటేనే ఆలుమగల మధ్య బంధం బలపడుతుంది. ప్రేమ నిలబడుతుంది. ఇది సామాన్యులకే కాదు.. సెలబ్రెటీలకు కూడా వర్తిస్తుంది. నిజానికి సామాన్యుల కాపురాలకే పద్ధతిగా ఉంటాయి. సెలబ్రెటీల్లో వ్యసనాలు, ఎఫైర్లు, సినిమా వ్యామోహాలతో విడాకులకు దారితీసే జంటలు ఎన్నో ఉన్నాయి. అయితే స్టార్ హీరోయిన్ సమంత మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకొని పెళ్లి అయ్యాక కూడా స్టార్ హీరోయిన్ గా నటిస్తూ భర్త నాగచైతన్యకు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 3, 2021 / 01:14 PM IST
    Follow us on

    సంసారం అన్నాక చిర్రుబుర్రులు.. అలకలు.. కోపాలు.. తాపాలు.. కాసిన్ని గొడవలు ఉండాలి. అలా ఉంటేనే ఆలుమగల మధ్య బంధం బలపడుతుంది. ప్రేమ నిలబడుతుంది. ఇది సామాన్యులకే కాదు.. సెలబ్రెటీలకు కూడా వర్తిస్తుంది.

    నిజానికి సామాన్యుల కాపురాలకే పద్ధతిగా ఉంటాయి. సెలబ్రెటీల్లో వ్యసనాలు, ఎఫైర్లు, సినిమా వ్యామోహాలతో విడాకులకు దారితీసే జంటలు ఎన్నో ఉన్నాయి.

    అయితే స్టార్ హీరోయిన్ సమంత మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకొని పెళ్లి అయ్యాక కూడా స్టార్ హీరోయిన్ గా నటిస్తూ భర్త నాగచైతన్యకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంసారసాగరాన్ని ఈదుతుండడం విశేషం.

    నిజానికి పెళ్లయ్యాక హీరోయిన్లు హౌస్ వైఫ్ అయిపోతుంటారు. వాల్లు వేరే హీరోల పక్కన హీరోయిన్లుగా చేయడానికి ఏ హీరో ఒప్పుకోడు. కానీ నాగచైతన్య మాత్రం అక్కినేని ఇంటి కోడలుగా మారిన సమంతకు ఫ్రీడం ఇచ్చేశాడు. లేదా సమంతనే తన ఇష్టం ప్రకారం ఫ్రీడం తీసుకుందేమో తెలియదు కానీ ఇప్పుడే ఎక్కువగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ సందడి చేస్తోంది.

    తాజాగా ఆమె నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సిరీస్ విడుదలకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా తన భర్త నాగచైతన్యతో కాపురం గురించి బయటపడింది. తనకు, నాగచైతన్యకు మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయని ఆమె స్పష్టం చేశారు. అయితే ప్రతీసారి తానే కాంప్రమైజ్ అయ్యి మొదట రాజీపడుతానని సమంత చెప్పుకొచ్చింది. అలా భర్తతో ఎందుకు గొడవలు అవుతున్నాయన్న విషయాన్ని మాత్రం సమంత బయటపెట్టకపోవడం గమనార్హం.