https://oktelugu.com/

విద్యాసంస్థల ఓపెన్‌పై జగన్‌ స్ట్రాటజీ ఏంటి..?

‘నవ్వినా నాప చేనే పండక మానదు’.. అవును మరి.. కరోనా ప్రారంభంలో ఏపీ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను కొందరు ఇలానే వెక్కిరించారు. కరోనాను ఇప్పట్లో తరలలేం.. సహజీవనం తప్పదు.. జాగ్రత్తలు తప్పనిసరి అంటూ జగన్‌ చెబితే.. చాలా మంది ఎకసెకలు అనుకున్నారు. కానీ.. చివరికి అదే నిజమయ్యే సరికి తెల్లమొఖాలు వేసుకున్నారు. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్ ఏ లీడర్‌‌కు అయినా ఉండాల్సిన లక్షణం కూడా. భయంతో వణికే వేళ.. భరోసా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 8:03 pm
    Follow us on

    AP Schools Opening

    ‘నవ్వినా నాప చేనే పండక మానదు’.. అవును మరి.. కరోనా ప్రారంభంలో ఏపీ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను కొందరు ఇలానే వెక్కిరించారు. కరోనాను ఇప్పట్లో తరలలేం.. సహజీవనం తప్పదు.. జాగ్రత్తలు తప్పనిసరి అంటూ జగన్‌ చెబితే.. చాలా మంది ఎకసెకలు అనుకున్నారు. కానీ.. చివరికి అదే నిజమయ్యే సరికి తెల్లమొఖాలు వేసుకున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఏ లీడర్‌‌కు అయినా ఉండాల్సిన లక్షణం కూడా. భయంతో వణికే వేళ.. భరోసా ఇస్తూ.. చేదు వాస్తవాన్ని చెప్పటానికి మించిన మంచి పని మరొకటి లేదు. ఈ విషయంలో జగన్ దానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయంపైనా ఆసక్తికర చర్చ నడుస్తోంది. దేశంలోనూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మహమ్మారి తీవ్రత తగ్గుతూ.. కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నవేళ.. దాన్ని మరింత తగ్గించే ప్రయత్నం చేయాలి.

    Also Read: లోకేష్ కోసం త్యాగం చేసేది చంద్రబాబా? మామ బాలయ్యనా?

    కానీ.. అందుకు భిన్నంగా స్కూళ్లు, కాలేజీలు ఓపెన్‌ చేయాలన్న నిర్ణయం తీసుకోవడంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చనే నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్కూళ్లు.. కాలేజీలు.. విశ్వవిద్యాలయాలు.. సినిమా థియేటర్లు ఇలా.. కొన్నింటి విషయంలో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. సానుకూలంగా నిర్ణయం తీసుకోవటానికీ సిద్ధంగా లేరు. కారణం ఏమంటే..స్కూళ్లు..కాలేజీలకు సంబంధించి చూస్తే.. పేద.. మధ్యతరగతితో సహా అన్ని వర్గాల వారు ఏదోలా తమ పిల్లలు చదువుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా స్కూళ్లు..కాలేజీలు తెరవాల్సిన అవసరం లేదు.

    మరి ఒక్కసారిగా విద్యాసంస్థలు ఓపెన్‌ చేస్తే పిల్లలు.. పెద్దలు అందరూ చాలా దగ్గరగా ఉంటారు. దీని వల్ల వైరస్ వ్యాప్తి ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ వాదనలో వాస్తవం ఏమిటన్నది ఇటీవల వెలువడుతున్న కేసులు స్పష్టం చేస్తున్నాయి. టీచర్లకు సంబంధించి పాజిటివ్ కేసులు నమోదైతే.. వారి ఇంట్లోని వారికి ఇబ్బంది. అదే పిల్లలకు జరిగే నష్టమేమంటే.. వారి ఇళ్లల్లోని పెద్ద వయస్కుల వారికి  కొత్త ముప్పుగా మారుతుంది.

    Also Read: బాబును కూల్చింది.. ‘ఇసుక’ తుఫాన్‌ రాకుండా జగన్‌ చర్యలు

    ఈ కారణంతోనే జగన్ తీసుకున్న స్కూళ్ల ఓపెనింగ్ పై పలువురు తప్పు పడుతున్నారు. అయితే.. కరోనా విషయంలో అది ఎంతటి ప్రభావవంతమైందో చెప్పిన జగన్‌.. ఇప్పుడు విద్యాసంస్థలు ఓపెన్‌ చేయడంపై ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారా అని అందరిలోనూ డౌట్‌ ఉంది. రోజురోజుకు స్కూళ్లలో పెరుగుతున్న కేసులు ప్రభుత్వానికి తలనొప్పిగా మారక ముందే.. మేల్కొని కీలక నిర్ణయం తీసుకోవటం మంచిందంటున్నారు నిపుణులు.