https://oktelugu.com/

ఎస్పీ బాలుకు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు

ఒక పాటల కోవెల ఒదిగిపోయింది. ఒక మహా గంధర్వుడు చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచి వెళ్లిపోయాడు. దేశం గర్వించదగ్గ గాయకుల్లో ఎస్పీ బాలు ఒకరు. ఆయన మరణంతో ముఖ్యంగా సినీ ప్రపంచం మూగబోయింది. ఆయనకు నివాళులు చెబుతూ పలువురు సినీ , రాజకీయ, క్రీడా ప్రముఖులు ట్వీట్లు చేశారు. మీ పాటలతో మా గుండెల్లో బాబు ఎప్పటికీ బతికే ఉంటారని పేర్కొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో దేశమంతా ఉద్వేగ వాతావరణం నెలకొంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, […]

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2020 / 05:59 PM IST
    Follow us on

    ఒక పాటల కోవెల ఒదిగిపోయింది. ఒక మహా గంధర్వుడు చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచి వెళ్లిపోయాడు. దేశం గర్వించదగ్గ గాయకుల్లో ఎస్పీ బాలు ఒకరు. ఆయన మరణంతో ముఖ్యంగా సినీ ప్రపంచం మూగబోయింది. ఆయనకు నివాళులు చెబుతూ పలువురు సినీ , రాజకీయ, క్రీడా ప్రముఖులు ట్వీట్లు చేశారు. మీ పాటలతో మా గుండెల్లో బాబు ఎప్పటికీ బతికే ఉంటారని పేర్కొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో దేశమంతా ఉద్వేగ వాతావరణం నెలకొంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలాయళం సహా వివిధ భాషల్లో దాదాపు 50వేల పాటలు పాడి.. నటుడిగా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా బాలు పేరుపొందాడు. ఆయన మరణంతో దేశవ్యాప్తంగా అందరూ సంతాపం తెలుపుతున్నారు.

    Also Read: బాలు కెరీర్‌లో అరుదైన ఫొటో..

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో సినిమా ఇండస్ట్రీ శోకసంద్రమైంది. సంగీత ప్రపంచంలో నిశ్శబ్ధం ఆవరించిందని దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. టాలీవుడ్ నుంచి ప్రముఖ హీరో చిరంజీవి ట్వీట్ చేశారు. సినీ సంగీత ప్రపంచంలోనే ఈరోజు చీకటి రోజు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

    ఇక చిరంజీవితోపాటు అగ్రహీరోలు నాగార్జున, వెంకటేశ్, బాలక్రిష్ణ, మహేష్ బాబు సహా టాలీవుడ్ హీరోలు, సంగీత దర్శకులు, దర్శకులు బాలు మృతికి సంతాపం తెలిపారు. ఏఆర్ రెహమాన్ సైతం బాలుతో ఫొటో పంచుకొని ఆవేదన చెందారు. తోటి గాయకులు కూడా ఆయన మరణంపై ట్వీట్లు చేశారు.

    బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సహా సినీ, రాజకీయ ప్రముఖులంతా కూడా బాలు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు క్రీడా ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు.

    విలక్షణ నటుడు కమల్ హాసన్, రజినీకాంత్, తమిళ హీరోలు, దర్శకులు, సంగీత దర్శకులు కూడా ఆయన మరణంపై ట్వీట్లు చేశారు.

    ఎస్పీ బాలు మరణంపై ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. ‘ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దురదృష్టకర మరణంతో మన సాంస్కృతిక ప్రపంచం మూగబోయింది.. భారతదేశం అంతటా ఆయన శ్రావ్యమైన స్వరం మరియు సంగీతం దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నా.. ఓం శాంతి.’ అంటూ మోడీ వ్యాఖ్యానించారు.

    Also Read: నాన్న పాటలు గుర్తుండిపోతాయి: ఎంజీఎం ఆసుపత్రి ఎదుట ఎస్పీ చరణ్‌

    ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా సీఎం కేసీఆర్, మంత్రులు తలసాని, హరీష్ రావు, టీఆర్ఎస్ నేత కవిత ట్విట్టర్ లో ఎస్పీ బాలుకు నివాళులర్పించారు.

    ఇక ఏపీ సీఎం జగన్ కూడా ఎస్పీ బాలు మరణంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.’ అని సీఎంజగన్ ఆవేదన వ్యక్తం చేశారు.