Irumudi Movie: రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో రవితేజ తనలోని డిఫరెంట్ యాంగిల్ ని బయటకు తీసి చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ లు ఉండబోతున్నాయట. రవితేజ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలిపాలనే ప్రయత్నం చేస్తున్నాడట. తన పర్ఫామెన్స్ ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అవ్వబోతుందట. ఇక ఇదిలా ఉంటే రవితేజ తన కూతురిని కాపాడడం కోసం ఈ సినిమాలో చాలా విన్యాసాలైతే చేస్తాడట. ఇక అందులోనే ఒక భారీ ట్విస్ట్ కూడా ఉండబోతుందట. రవితేజ ఏ కూతురు కోసమైతే తన ప్రాణాలకు తెగించి కాపాడుకున్నాడో ఆమె తన కూతురు కాదనే ఒక ట్విస్ట్ సినిమా చివర్లో రివిల్ అవుతుందట. ఇంతకీ ఆమె ఎవరు? రవితేజ కి ఆమెకి సంబంధం ఏంటి అనే విషయాలు ఈ సినిమాలో చాలా ఎమోషనల్ గా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
మొత్తానికైతే ఇరుముడి సినిమా మీద ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం పాజిటివ్ వైబ్ తో ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఆగస్టు నెలలో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయడం పక్కా అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం… ఇక ఇప్పటికే ఈ సంవత్సరం రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అయినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన కొంతవరకు డీలాపడిపోయాడు. ఇక ఇప్పుడు రాబోయే సినిమాలతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తాడు. తద్వారా ఆయనకంటు ఒక మార్కెట్ ని ఏర్పాటు చేసుకోగలుగుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక రాబోయే రోజుల్లో కూడా రవితేజ డిఫరెంట్ కథలతో సినిమాలను చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడట. ఇప్పటికే కొంతమంది దర్శకులు చెప్పిన కథలను వింటున్నాడు. అయినప్పటికి అవేవి ఓకే చేయడం లేదట. తొందర్లోనే కొన్ని మంచి కథలను ఫైనల్ చేసి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది…
