Ram Charan : ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలై రెండేళ్లు కావస్తుంది. రామ్ చరణ్ నుండి మరో చిత్రం రాలేదు. దర్శకుడు శంకర్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్ ఆలస్యం అవుతుంది. శంకర్ భారతీయుడు 2 ప్రాజెక్ట్ సైతం పూర్తి చేస్తున్న క్రమంలో గేమ్ ఛేంజర్ షూటింగ్ నత్త నడక సాగుతుంది. ఈ ఏడాది చివర్లో గేమ్ ఛేంజర్ విడుదలయ్యే సూచనలు కలవు. కాగా రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానతో నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పిన విషయం తెలిసిందే.
రామ్ చరణ 16వ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామా అని ప్రచారం జరుగుతుంది. రెండో చిత్రంతోనే రామ్ చరణ్ వంటి స్టార్ హీరోతో ఛాన్స్ దక్కించుకున్న బుచ్చిబాబు సాన అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. రామ్ చరణ్-16 ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైందట. కాగా ఈ మూవీలో సమంత కీలక రోల్ చేయనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
ఈ మేరకు సమంత సైన్ చేశారట. బుచ్చిబాబు-చరణ్ చిత్రంలో సమంత రోల్ గొప్పగా ఉంటుందట. తన క్యారెక్టర్ నచ్చడంతో సమంత పచ్చజెండా ఊపారట. గతంలో సమంత-చరణ్ రంగస్థలం చిత్రంలో జత కట్టారు. రామ్ చరణ్ కెరీర్లో రంగస్థలం మైలురాయిగా నిలిచిపోయింది. దర్శకుడు సుకుమార్ రంగస్థలం చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆయన శిష్యుడు బుచ్చిబాబు సాన సైతం సమంతను రామ్ చరణ్ కి జంటగా తెస్తున్నాడట.
దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సమంత ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ఆమె కొత్త చిత్రాలకు సైన్ చేయడం లేదు. మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత సుదీర్ఘ కాలంగా చికిత్స తీసుకుంటుంది. మరి రామ్ చరణ్ మూవీతో ఆమె రీ ఎంట్రీ ఇస్తారేమో చూడాలి. ఈ మూవీలో మరొక హీరోయిన్ కూడా నటిస్తారట. మొత్తంగా లేటెస్ట్ అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచేసింది.