Krishna Passed Away : పగవాడికి కూడా రాని కష్టం మహేష్ కి వచ్చింది. నెలలు, రోజుల వ్యవధిలో ముగ్గురు కుటుంబ సభ్యులు కన్నుమూశారు. అన్న, అమ్మ, నాన్న… రక్తం పంచిన, రక్తం పంచుకు పుట్టిన వారు వరుసగా దూరమయ్యారు. సన్నిహితులు మరణిస్తేనే మనసు కలచి వేస్తుంది. కుటుంబ సభ్యులు దూరమైతే , వారు తిరిగిరారని తెలిస్తే జీర్ణించుకోవడం కష్టం. ఒకరికి ముగ్గురు… మూడు ఉపద్రవాలు మహేష్ ని ముంచేశాయి. అభిమానులు, ప్రముఖులు, సన్నిహితులు మహేష్ కు ధైర్యం చెబుతున్నారు. ఆయనకు దేవుడు శక్తిని, మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు.

అయితే మహేష్ బాబు కంటే కృష్ణ మరణంతో ఎక్కువగా నష్టపోయిన, ఒంటరైన వ్యక్తి మరొకరు ఉన్నారు. మహేష్ కి నాన్న తోడు లేదనే బాధ తప్పితే ఆయన అవసరం, అండ అక్కర్లేదు. ఎందుకంటే మహేష్ సూపర్ స్టార్ గా నిలదొక్కుకున్నాడు. ఏడాదికి వందల కోట్ల సంపాదన మహేష్ సొంతం. భార్యా, పిల్లలతో చక్కని కుటుంబం ఉంది. నమ్రత తరఫున ఆయనకు పెద్ద బంధుగణం ఉంది. ఇక్కడ కృష్ణ మరణంతో అధికంగా నష్టపోయింది, కోడలు మృదుల.
కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు భార్యనే మృదుల. ఈమె గురించి బయట ప్రపంచానికి తెలిసింది తక్కువ. పెద్దింటి కోడలైనప్పటికీ ఆమె అసలు ఫోకస్ కాలేదు. రమేష్ బాబు సినిమాలకు దూరమయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనతో పాటు మృదుల కూడా లో ప్రొఫైల్ మైంటైన్ చేశారు. చివరికి రమేష్ బాబు కొడుకు, కూతురు కూడా గుర్తింపు కోరుకోలేదు. దురదృష్టవశాత్తు రమేష్ బాబు అనారోగ్యంతో మరణించారు. చిన్న వయసులోనే మృదుల భర్తను కోల్పోయారు.
ఇక కొడుకు, కూతురు సెటిల్ కాలేదు. రమేష్ మరణించినప్పటికీ కృష్ణ ఆమెకు అండగా నిలబడ్డారు. పిల్లల భవిష్యత్ కి భరోసా ఇచ్చారు. కొడుకును ప్రయోజకుడిని చేయడం, కూతురికి పెళ్లి చేయడం మృదుల ముందున్న సవాళ్లు. అయితే మహేష్ మద్దతు ఆమెకు బాగానే ఉన్నట్లు వినికిడి. అన్నయ్య రమేష్ బాబును అమితంగా ప్రేమించే మహేష్ ఆయన పిల్లల పట్ల అదే ప్రేమ, ఆప్యాయత చూపిస్తారట. వదిన ఆమె ఇద్దరు పిల్లల బాధ్యత ఇప్పుడు మహేష్ దే. వారిపట్ల ఆయన రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది.