Jailer 2: రజినీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘జైలర్ 2’ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. గత మూడు సంవత్సరాల క్రితం వచ్చిన ‘జైలర్’ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధించిందో మనందరికి తెలిసిందే. ఇక దానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాను సైతం డిఫరెంటింగ్ ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడట. ఇక రజనీకాంత్ సైతం ఈ మూవీలో ది బెస్ట్ పర్ఫామెన్స్ ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అతనికి ఆరోగ్యం సహకరించకపోయిన కూడా ఆయన సినిమా కోసం ఎక్కడ తగ్గకూడదనే ఉద్దేశ్యంతో ది బెస్ట్ పర్ఫామెన్స్ ను ఇచ్చి సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాడట. ఇక నెల్సన్ డైరెక్షన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నెల్సన్ డిఫరెంట్ యాంగిల్లో అద్భుతంగా తెరకెక్కించడానికి తన శాయ శక్తుల ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.
గతంలో ఆయన చేసిన సినిమాలను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆయన చాలా పాషన్ ఉన్న దర్శకుడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇక హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా నెల్సన్ వరుస సినిమాలను చేస్తున్నాడు. జైలర్ సినిమా 400 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. ఇప్పుడు జైలర్ 2 సినిమాతో ఆ కలెక్షన్స్ ని బీట్ చేస్తూ 1000 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుందనే అంచనాలో నెల్సన్ ఉన్నాడు.
మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. కాబట్టి ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఎలాంటి రిజల్ట్ ను కట్టబెడతారు అనే దానికోసమే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఫైనల్ గా ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపద్యంలో ఈ సినిమాతో ఎలాగైనా సరే మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని రజనీకాంత్ సైతం ఆరాటపడుతున్నాడు…
ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. సీనియర్ హీరోలందరిలో రజనీకాంత్ 1000 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టి అందరికంటే తనే టాప్ పొజిషన్లో ఉన్నానని ప్రూవ్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
