Rajasekhar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపును సంపాదించుకున్న నటుడు రాజశేఖర్… గతంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకు హీరోగా మార్కెట్ పూర్తిగా పడిపోయింది. దాంతో ఏం చేయాలో తెలియక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. దాంతో డిఫరెంట్ సినిమాల్లో ఆయనకు నటించే అవకాశాలైతే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా శర్వానంద్ హీరోగా చేసిన బైకర్ సినిమాలో ఫాదర్ పాత్రలో కనిపించాడు. మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ఇప్పుడు మరికొన్ని సబ్జెక్టులను సైతం సైన్ చేసినట్టుగా తెలుస్తుంది. చిరంజీవి – బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాలో సైతం రాజశేఖర్ ని ఒక విలన్ పాత్ర కోసం తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారట.
కానీ రాజశేఖర్ ఒక విషయంలో క్లారిటిగా ఉంటేనే ఆయన్ని సినిమా కోసం తీసుకుంటామని చెబుతున్నట్టుగా తెలుస్తుంది. అది ఏంటి అంటే రాజశేఖర్ చిరంజీవి చేతిలో దెబ్బలు తినాల్సి ఉంటుంది. ఇక దానికి రాజశేఖర్ ఒప్పుకున్నట్లయితే అతన్ని ఈ సినిమాలో తీసుకుంటారట. లేకపోతే మాత్రం అతని ప్లేస్ లో మరొక విలన్ ను తీసుకునే అవకాశాలైతే ఉన్నాయి.
రాజశేఖర్ ఆ కండిషన్స్ కి ఒప్పుకుంటాడా? లేదంటే తనకు సినిమా పోటీ నడిచింది. ఇక ఇలాంటి రాజశేఖర్ చిరంజీవితో ఎప్పటికప్పుడు మాటల యుద్ధం చేస్తూ వచ్చాడు…ఇక ఇప్పుడు చిరంజీవి చేతిలో దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉంటే రాజశేఖర్ ను ఆయన సినిమాలో విలన్ పాత్ర కోసం తీసుకుంటారట.
లేకపోతే మాత్రం అతని ప్లేస్ లో మరొక బాలీవుడ్ హీరోను తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వీలైనంత తొందరగా బాబీ చిరంజీవి సినిమానే కాకుండా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధం చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…