Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న దర్శకులు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు…గుణశేఖర్ లాంటి దర్శకుడు సైతం చిరంజీవితో చూడాలని ఉంది అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత బాలయ్య బాబుతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అప్పుడే చిరంజీవి మృగరాజు అనే సినిమా స్టార్ట్ చేశాడు. అయితే బాలయ్య బాబుతో గుణశేఖర్ సినిమా చేయాల్సి ఉన్నప్పటికి అది చిరంజీవి వల్లే పోస్ట్ పోన్ అయిందని ఇక దాంతో మొత్తానికైతే ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయిందని పలువురు సినిమా మేధావులైతే చెబుతూ ఉంటారు.
చిరంజీవి అదే సమయంలో మృగరాజు సినిమా కోసం గుణశేఖర్ ను సంప్రదించడం తో గుణశేఖర్ వెంటనే చిరంజీవితో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట. దాంతో బాలయ్య తో చేయాల్సిన సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు గుణశేఖర్ కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు.
ఒకవేళ అప్పట్లో వీళ్ళ కాంబోలో ఒక సినిమా వచ్చి ఉంటే ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించి ఉండేదేమో అని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం గుణశేఖర్ డిఫరెంట్ సినిమాలను చేయడానికి ప్రయత్నం చేసిన కూడా అది కార్యరూపం దాల్చలేదు. బాలయ్య బాబు, చిరంజీవి సైతం ఈ ఏజ్ లో కూడా డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. వరుస సక్సెస్ లను సాధించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
యంగ్ హీరోలతో పోటీపడుతూ ముందుకు దూసుకెళుతుండడం విశేషం… ఇద్దరు సీనియర్ హీరోలుగా పేరు సంపాదించుకున్నప్పటికి కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. డాన్స్ ల్లోనూ ఫైట్ల లోనూ వాళ్లతో పోటీపడుతూ వాళ్ళకంటే మేమే గొప్ప అనే రేంజ్ లో సక్సెస్ లను సాధిస్తుండడం విశేషం…