Rajamouli Son Karthikeya: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తరికెక్కిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక ఇప్పటివరకు అపజయ మెరుగని దర్శకుడుగా పేరు సంపాదించుకున్న ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అరుదైన రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. తనలాంటి దర్శకుడు మరొకరు ఉండడానికి వాస్తవం. మరి ఇలాంటి క్రమంలో తన కొడుకు ఆయన కార్తికేయను సైతం సినిమా ఇండస్ట్రీలోనే రాణింపజేయాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు. ఇంతకుముందు కార్తికేయ కొన్ని బిజినెస్ పనులను చూసుకున్నప్పటికి అందులో కొంతవరకు నష్టాలైతే వచ్చాయి. దాంతో సినిమా ఇండస్ట్రీలోనే తను కొనసాగాలని రాజమౌళి చెప్పాడు. ఇక ఇప్పుడు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ను హీరోగా పెట్టి శశాంక్ అనే డైరెక్టర్ ను పరిచయం చేస్తూ కార్తికేయ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ అనే సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాకి రాజమౌళి ప్రెజెంటర్ గా వ్యవహరిస్తుండడం విశేషం… కార్తీకేయ ఒక్కడే సింగ్ గా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం లేదు. బాహుబలి ప్రొడ్యూసర్స్ అయినా శోభు యార్లగడ్డ సైతం ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం…
వీళ్ళిద్దరు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది అంటూ కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు.
రొటీన్ సినిమాల కంటే డిఫరెంట్ గా ఈ సినిమా ఉండబోతుందనే విషయాన్ని టీజర్ పర్ఫెక్ట్ గా చెప్పేసింది. అందులో భాగంగానే ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే కార్తికేయ ప్రొడ్యూసర్ గా నిలదొక్కుకుంటాడు. లేకపోతే మాత్రం మరోసారి ఆయన డీలా పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆయన రాజమౌళి సినిమా కి సంబంధించిన అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నాడు.
కానీ ఒక పర్ఫెక్ట్ పోస్ట్ అనేది లేకపోవడంతో ఆయన్ను ప్రొడ్యూసర్ గా సెటిల్ చేయాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికోసం మొదట ఒక చిన్న సినిమాతో అతన్ని ప్రొడ్యూసర్ గా ఎంటర్ చేస్తున్నారు. ఈ మూవీ సక్సెస్ అయితే స్టార్ హీరో తోనే ప్రొడ్యూసర్ గా రంగంలోకి దిగే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది…
